
ఫేస్‌బుక్ లైవ్‌లో అత్యాచారం
అమెరికాలో పదిహేనేళ్ల వయసున్న ఓ బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ సంఘటనను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
న్యూయార్క్: అమెరికాలో పదిహేనేళ్ల వయసున్న ఓ బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ సంఘటనను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ అమానవీయ ఘటన గత ఆదివారం (మార్చి 19న) షికాగోలో జరిగింది. అత్యాచారాన్ని 40 మంది లైవ్‌లో చూసినా, వారిలో ఏ ఒక్కరూ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.
పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 19న బాలిక కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ఆమెను ఐదారుగురు అత్యాచారం చేస్తూ వీడియోను ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రసారం చేశారు. కూతురు కనిపించకపోవడంతో 20వ తేదీ రాత్రి బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 21న బాలికను కనిపెట్టి ఇంటికి చేర్చారు.