'సానియాతో నా బంధం ధృడమైనది' | Sania Mirza and I Have a Strong Relationship, Shoaib Malik | Sakshi
Sakshi News home page

'సానియాతో నా బంధం ధృడమైనది'

Published Sat, Dec 20 2014 12:38 PM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

'సానియాతో నా బంధం ధృడమైనది'

'సానియాతో నా బంధం ధృడమైనది'

కరాచీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ తన వైవాహిక జీవితంపై  చాలా కాలం తర్వాత పెదవి విప్పాడు. సానియాతో పెళ్లైన నాలుగు సంవత్సరాల అనంతరం వారి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయని  భారత్ లోని మీడియాతో పాటు పాకిస్థాన్ మీడియాలో కూడా తరుచు వార్తలు  రావడంతో ఎట్టకేలకు షోయబ్ స్పందించాడు.  తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని నొక్కిచెప్పాడు. ప్రస్తుతం తామిద్దరం దుబాయ్ లో ఉన్నామన్నాడు. 'మా మధ్య ఎటువంటి బేధాభ్రిపాయాలు లేవు. మా జీవితం సాఫీగానే ఉంది. ఒక జంటగా మా మధ్య సమస్యలు అనేవి లేవు'  అని షోయబ్ తెగేసి చెప్పాడు.

 

తామిద్దరం వృత్తిపరంగా కూడా ఎంతో నిబద్దత ఉన్నామన్నాడు. ఇద్దరు సెలిబ్రెటీలు అయినందున వృత్తిపరమైన సమస్యలు కూడా తమపై ప్రభావం చూపలేదన్నాడు. పాకిస్థాన్ నటి హుమైమాతో సంబంధాల గురించి కూడా ప్రస్తావించగా.. సానియా తన భార్య కాగా, హుమైమా తనకు ఒక మంచి స్నేహితురాలని షోయబ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా వచ్చే ప్రపంచ కప్ కు ఆడతారా?అన్న ప్రశ్నకు సమాధానం షోయబ్ దాటవేత ధోరణి అవలంభించాడు. తాను ఎప్పుడూ ప్రపంచ కప్ మ్యాచ్ ల్లో పాల్గొనడం లేదని ఎప్పుడూ చెప్పులేదు కదా!అని షోయబ్ ప్రశ్నించాడు.తాను పాకిస్థాన్ క్రికెట్ కు ఎప్పుటూ అందుబాటులో ఉంటానన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement