లాస్ ఏంజిల్స్: గెలాక్సీలోని ఆక్సిజన్ స్థాయిని మొట్టమొదటిసారిగా కచ్చితత్వం తో ఖగోళశాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా గెలాక్సీల పరిణామ క్రమాన్ని పూర్తి గా తెలుసుకోవచ్చని లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అలిస్ షాప్లీ అన్నారు. నక్షత్రాలు నిర్జీవం అయిపోతున్న క్రమంలో విడుదలయ్యే వాయువు ఆక్సిజన్‌గా రూపాంతరం చెందుతుందని ఆయన తెలి పారు.
సుదూరంగా ఉన్న కాస్మోస్ - 1908 అనే గెలాక్సీలో ఆక్సిజన్ స్థాయిని కచ్చితత్వంతో గుర్తించామని అన్నారు. దీని ద్వారా కొన్ని బిలియన్ సంవత్సరాల గెలాక్సీల పరిణా మ క్రమాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఖగోళశాస్త్రవేత్తలకు మార్గం సుగమం అయిందని షాప్లీ అభిప్రాయపడ్డారు.
సుదూర గెలాక్సీలో ఆక్సిజన్ స్థాయిని గుర్తించిన శాస్త్రవేత్తలు
Published Fri, Aug 5 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
Advertisement