వాషింగ్టన్: ఆరుగురు భారతీయ అమెరికన్లకు ప్రతిష్టాత్మక ఎలిస్ ఐలాండ్ మెడల్ గౌరవం దక్కింది. అమెరికా పౌరులకు ఏటా ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక మెడల్స్ ఈ ఏడాది 2014కు గాను ఆరుగురు భారతీయ అమెరికన్లు సొంతం చేసుకున్నారు. అమెరికాలోని సంప్రదాయ తెగల అభివృద్ధికి, అమెరికా జీవన విధానంలోని విలువలను పెపొందించేందుకుగాను చేసిన కృషికి గుర్తింపుగా ఈ మెడల్స్‌ను అందజేస్తారు. మెడల్ అందుకున్న వారిలో.. యష్‌పాల్ సోయి(అమెరికాలో బాలీవుడ్‌ను విసృ్తతంగా ప్రచారంలోకి తెచ్చిన ప్రముఖుడు), నర్పట్ భండారీ(సిలికాన్ వ్యాలీ వ్యవస్థాపకుడు), సామిర్ దేశాయ్(మసాచుసెట్స్‌కు చెందిన వ్యాపారవేత్త, మానవతావాది), అరుణ్‌కుమార్ ప్రామాణిక్(లూసియానా వర్సిటీలో ప్రొఫెసర్), కెత్కి శారద్ కుమార్(న్యూయార్క్‌లో క్లినికల్ డెరైక్టర్), అబ్దుల్ ఎం సులేమాన్(ఈక్వినాక్స్ హోటల్స్ సీఈఓ) ఉన్నారు.