బీజింగ్: ఓడలు ఢీకొన్న ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ తీరంలోని పెర్ల్ నదీమార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు ఐదువేల టన్నుల ఇసుకతో వెళ్తున్న ఓడ, 5వేల టన్నుల ఉక్కుతో వెళ్తున్న మరో ఓడను ఢీకొనటంతో ఇసుక ఓడ మునిగిపోయింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఉక్కు లోడు ఓడలో ఉన్న 11 మంది సిబ్బందిని రక్షించారు. ఇసుక లోడు ఓడకు సంబంధించి ఐదుగురిని కాపాడగలిగారు.
ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది నీటిలో గల్లంతయ్యారని అధికారులు భావిస్తున్నారు. వారి కోసం 20 మంది గజ ఈతగాళ్లతోపాటు వంద మంది సిబ్బంది గాలింపు చర్యలు సాగిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన రెండు ఓడలు జియాంగ్సు, ఫుజియాన్ ప్రావిన్స్‌లకు చెందినవని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment