అంతరిక్షం నుంచి సూపర్ సెల్ఫీ! | Super selfie from outer space! | Sakshi
Sakshi News home page

అంతరిక్షం నుంచి సూపర్ సెల్ఫీ!

Published Fri, Oct 17 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

అంతరిక్షం నుంచి సూపర్ సెల్ఫీ!

అంతరిక్షం నుంచి సూపర్ సెల్ఫీ!

పెద్ద గాజుపలక.. డంబెల్‌లాంటి ఓ బండరాయి ఉన్నట్లు కనిపిస్తున్న ఈ చిత్రం ఓ సెల్ఫీ(స్వీయచిత్రం)! ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా)కు చెందిన రోసెట్టా వ్యోమనౌక అక్టోబరు 7న దీనిని తీసుకుంది. చిత్రంలో గాజుపలకలా కనిపిస్తున్నది రోసెట్టా 14 మీటర్ల సౌరవిద్యుత్ పలక కాగా.. రాయిలా కనిపిస్తున్నది ‘67/పీ చుర్యుమోవ్ గెరాసిమెంకో’ అనే తోకచుక్క! పదేళ్లుగా ఈ తోకచుక్కను వెంటాడుతూ అంతరిక్షంలో వందల కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన రోసెట్టా ఎట్టకేలకు ఆ తోకచుక్కకు 16 కి.మీ. సమీపంలోకి చేరుకుంది.

నవంబరు 11న ఫిలే అనే ఓ ల్యాండర్‌ను ఈ తోకచుక్కపైకి దింపనున్న రోసెట్టా  పరిశోధనలు చేసి భూమికి సమాచారం పంపనుంది.  47.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తోకచుక్క గుట్టు తెలిస్తే.. భూమిపైకి నీరు, జీవం ఎలా ఏర్పడిందన్న విషయాలు తెలుస్తాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement