అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను పరిశీలిస్తే ఆయన భారత్ బాట (భారత్ గొంతుక వినిపిస్తున్నారని) పట్టినట్లు కనపడుతోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. దేశ భద్రతపై పార్లమెంటరీ కమిటీతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అప్ఘనిస్తాన్‌లో విఫలం చెందడానికి పాక్ కారణమని అమెరికా ఎలా అంటుదని ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన పాక్‌ను బలిపశువును చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
పాక్‌కు అమెరికా అందిస్తున్న 33 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంపై ట్రంప్ మాట్లాడుతూ.. బదులుగా అబద్ధాలు, మోసం తప్పితే ఏమీ రావడం లేదన్న విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడిన ఆసిఫ్.. అమెరికా నాయకుల వ్యాఖ్యలు సత్యదూరమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment