అఫ్ఘాన్‌లో కాల్పులు.. అమెరికా మేజర్ జనరల్ మృతి
కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్‌లపై 13 ఏళ్లుగా పోరాడుతున్న అమెరికా సేనలకు తొలిసారిగా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాబూల్‌కు పశ్చిమాన గల ఖార్గా క్యాంపు వద్దకు మంగళవారం అఫ్ఘాన్ ఆర్మీ యూనిఫామ్‌లో వచ్చిన ఓ ఉగ్రవాది నాటో బలగాలపై కాల్పులు జరపడంతో అమెరికాకు చెందిన ఓ మేజర్ జనరల్ మృతి చెందారు. జర్మనీకి చెందిన ఓ బ్రిగేడియర్ జనరల్‌తో సహా 15 మంది గాయపడ్డారు. వీరిలో సగం మంది అమెరికా సైనికులు, ముగ్గు రు అఫ్ఘాన్ ఆర్మీ అధికారులు ఉన్నారు.
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లపై నాటో బలగాలు సాగిం చిన యుద్ధంలో ఇంత అత్యున్నత స్థాయి అధికారిని అమెరికా కోల్పోవడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదిని బలగాలు హతమార్చాయని అఫ్ఘాన్ రక్షణ శాఖ అధికారి ప్రకటించారు. దీనిని పెం టగన్‌లోని అమెరికా రక్షణ శాఖ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఈ సంఘటనకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు.