వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాగ విధానంతో విసుగు చెందిన ఆ దేశ రక్షణ మంత్రి జిమ్ మాటిస్ తన పదవికి రాజీనామా చేశారు. సలహాదారుల సూచనను పెడచెవినపెడుతూ సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలని ట్రంప్ నిర్ణయించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం.
ట్రంప్‌తో మాటిస్ ముఖాముఖి భేటీ అనంతరం ఆయనతో విభేదాలు పొడసూపిన నేపథ్యంలో రాజీనామా చేయనున్నట్టు మాటిస్ ప్రకటించారని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ట్రంప్ ఒత్తడి కారణంగానే మాటిస్ రక్షణ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్నారనే వార్తలు నిరాధారమైనవని అమెరికన్ అధికారి స్పష్టం చేశారు.సిరియాపై ట్రంప్ నిర్ణయంతో విభేదించినందునే మాటిస్ వైదొలగారని మరికొందరు చెబుతున్నారు.
మాటిస్ నిష్క్రమణ అమెరికా సైనిక దళాలు, భాగస్వామ్య పక్షాలకు షాకింగ్‌గా భావిస్తున్నారు. తదుపరి రక్షణ మంత్రి ట్రంప్ విధానాలతో ఏకీభవించి నాటో సహా సైనిక ఒప్పందాలను గౌరవిస్తారా అనే ఆందోళన సైనిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ట్రంప్ ఎంచుకున్న అమెరికా ఫస్ట్ అజెండాతో కూడా మాటిస్ విభేదించారు.
Comments
Please login to add a commentAdd a comment