అమెరికానే మాకు ముఖ్యం : ట్రంప్‌ | US President Trump comments at United Nations | Sakshi
Sakshi News home page

అమెరికానే మాకు ముఖ్యం : ట్రంప్‌

Published Wed, Sep 25 2019 3:24 AM | Last Updated on Wed, Sep 25 2019 5:06 AM

US President Trump comments at United Nations - Sakshi

సదస్సులో ట్రంప్‌ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న ఆయన కూతురు ఇవాంకా, అల్లుడు కుష్నర్‌

ఐరాస: ఐక్యరాజ్య సమితి వేదికగా తన దేశ జాతీయవాదం, సౌర్వభౌమత్వాలకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బలంగా తన గళం వినిపించారు. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలపై ప్రపంచ దేశాల నిరసనను గట్టిగా తోసిపుచ్చారు. అంతేకాదు.. ‘మీమీ దేశాల ప్రాథమ్యాలకే ప్రాధాన్యత ఇవ్వండి. మీ సరిహద్దులను ధృఢపర్చుకోండి. దేశాల వారీగా మాత్రమే వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోండి. బహుళ దేశాలు భాగస్వామ్యులుగా ఉన్న కూటములను పక్కన బెట్టండి’ అని ఐరాసలోని దేశాలకు సలహా ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభను ఉద్దేశించి మంగళవారం ఆయన ప్రసంగించారు. ‘భవిష్యత్తు అంతర్జాతీయవాదులది కాదు.. దేశభక్తులదే భవిష్యత్తు.. బలమైన స్వతంత్ర దేశాలదే భవిష్యత్తు’ అని ట్రంప్‌ తేల్చిచెప్పారు. స్వదేశ ప్రయోజనాలను పణంగా పెట్టే విధానాలకు కాలం చెల్లిందని, అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement