వింత పందిని చూసేందుకు.. | Villager astounded after a 'freak' two-headed pig is born | Sakshi
Sakshi News home page

వింత పందిని చూసేందుకు..

Published Wed, Jun 8 2016 5:52 PM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

వింత పందిని చూసేందుకు..

వింత పందిని చూసేందుకు..

రెండు తలలు, మూడు కళ్లు, రెండు ముక్కులు, రెండు నోర్లతో తెల్లరంగులో ఎంతో ఆకర్షనీయంగా కనిపిస్తున్న పందిపిల్లను చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. చైనాలోని లుజ్హోయూలో మూడు రోజుల కింద జోన్గ్ గువోయివాన్ అనే రైతు పెంచుకుంటున్న పంది ఈ రెండు తలల పంది పిల్లకు జన్మనిచ్చింది. స్థానిక మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో చూడడానికి వింతగా ఉన్న ఈ పందిని వీక్షించడానికి చుట్టు పక్కన గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పోతున్నారు. దీన్ని తమతో ఉంచుకొంటే అదృష్టమని భావించిన కొందరు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి తమతో తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.   
 
గత మూడేళ్ల నుంచి తల్లి పందిని పెంచుతున్నట్టు రైతు జోన్గ్ గువోయివాన్ తెలిపారు. రెండు తలల పందితో పాటూ మరిన్ని పిల్లలకు కూడా అదే కాన్పులో జన్మనిచ్చిందన్నారు. రెండు తలల పందిపిల్ల అంటే తన కుమారుడికి చాలా ఇష్టమని, తనతోనే దాన్ని ఉంచుకుంటున్నాడని పేర్కొన్నారు. పెద్దమొత్తంలో రెండు తలల పందిని అమ్మాల్సిందిగా ఆఫర్లు వచ్చినా, తిరస్కరించినట్టు జోన్గ్ గువోయివాన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement