కైరో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్నారు వైద్యులు. అసలే మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తుండటంతో దాన్ని అదుపు చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరోవైపు కరోనా బారినపడి విలవిలాడుతున్న దేశాలు.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి. దీంతో కుటుంబం అంతా ఒకేచోట కలిసి ఉండే అవకాశం చిక్కింది. కానీ అత్యవసర సేవల్లో పనిచేసే సిబ్బందికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంది. ముఖ్యంగా కరోనాతో యుద్ధమే చేస్తున్న వైద్యులకు మరింత శ్రమ పెరిగింది. (ఐదు నిమిషాల్లోనే కరోనా టెస్ట్!)
ఈ క్రమంలో సౌదీ అరేబియాకు చెందిన ఓ వైద్యుడు కరోనా పేషెంట్లకు చికిత్స అందించి తన డ్యూటీ ముగియగానే మెడికల్ సూట్‌లోనే ఇంటికి చేరుకున్నారు రాగానే అతని కుమారుడు చెంగు చెంగున లేడిపిల్లలా పరిగెత్తుతూ ఆయన దగ్గరకు వెళ్లాడు. అయితే తండ్రి మాత్రం ఆనందంతో కొడుకుని దగ్గరకు తీసుకుని ముద్దాడలేదు. దగ్గరకు రావద్దు, దూరం జరుగు అంటూ ...అరచేతుల్లో ముఖం పెట్టుకుని కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొమ్మిది సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు తొమ్మిది మిలియన్ల మందికి పైగా వీక్షించగా వందల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. ‘ఇది నిజంగా నా మనసును తాకింది ఈ వీడియో చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను’ అని నెటిజన్లు భావోద్వేగంగా కామెంట్లు చేస్తున్నారు. (ప్రతి 22 మందిలో ఒకరు మృతి)
Comments
Please login to add a commentAdd a comment