టొరంటో: ‘రోజంతా మా అబ్బాయి స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతున్నాడు. ఇంట్లో ఎవరితోనూ కలవడు. స్మార్ట్‌ఫోన్ చూస్తూ.. భోజనం, ఆటలు, చదువు ఇలా అన్ని మర్చిపోతున్నాడు’అంటూ తల్లిదండ్రులు తెగ కంగారు పడిపోతుంటారు. దీంతో స్మార్ట్‌ఫోన్ వాడద్దంటూ పిల్లలపై ఆంక్షలు విధిస్తుంటారు. అలాగే పెద్దలు కూడా స్మార్ట్‌ఫోన్ వాడుతుంటే స్మార్ట్‌ఫోన్ బానిసలం అని వ్యాఖ్యానిస్తుంటాం. వాస్తవానికి పిల్లలతోపాటు పెద్దలెవరూ కూడా స్మార్ట్‌ఫోన్‌కు బానిసలు కారట.. కేవలం మనమంతా సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న బలమైన కోరిక వల్లే స్మార్ట్‌ఫోన్ వాడుతుంటామని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అంటే మనమంతా స్మార్ట్‌ఫోన్‌కు కాకుండా.. సోషల్ మీడియాకు మాత్రమే బానిసలం అని అంటున్నారు. ఇలాంటి వారంతా కేవలం హైపర్ సోషల్ తప్ప యాంటీ సోషల్ కాదని అధ్యయనం పేర్కొంది. సోషల్ మీడియాలో వేరే వాళ్ల గురించి తెలుసుకోవడానికి.. అలాగే తాను చేసేది అందరూ చూడాలనే కోరిక వల్లే సామాజిక మాధ్యమాల్లో అధిక సమయం గడుపుతున్నామని కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీకి చెందిన శామ్యూల్ తెలిపారు. ఇలా ఒకరి గురించి తెలుసుకోవాలనుకోవడం... మన గురించి ఇతరులు తెలుసుకోవాలనుకోవడం ఇప్పుడు కొత్తదేం కాదని.. పూర్వీకుల నుంచే వస్తోందని వివరించారు. నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేయడం, ఫోన్ చూడాల్సిన సందర్భాలను ముందుగానే ఎంచుకోవడం వంటివి చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్‌కు కొంచెం దూరంగా ఉండొచ్చని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment