చంద్రుడిని అన్ని కోణాల్లో చూడొచ్చు
బీజింగ్: చంద్రుడిని 360 డిగ్రీల కోణంలో చూపడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. కెమెరా పాయింటింగ్ సిస్టమ్(సీపీఎస్) అనే అధునాతన పరికరం సాయంతో కెమెరా కదలికల్ని ఒడిసి పట్టుకుని ఈ ఘనతను అందుకున్నారు. ప్రొఫెసర్ కాయ్ ల్యూన్గ్ యుంగ్ ఆధ్వర్యంలో హాంగ్‌కాంగ్ పాలిటెక్నిక్ వర్సిటీ, చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఈ ఆవిష్కరణకు ఊపిరిపోశాయి.
2.8 కేజీలు ఉండే ఈ సీపీఎస్ 85 సెంమీ, 27 సెంమీ, 16 సెంమీ. కొలతలు కలిగి ఉంటుంది. నిలువుగా 120 డిగ్రీలు, అడ్డంగా 340 డిగ్రీల కొలతలతో ఇది ఫొటోలు తీస్తుంది. ఎలాంటి ఉష్ణోగ్రతల పరిస్థితుల్లో అయినా పనిచేయం దీని ప్రత్యేకత.