The moon
-
భర్తల ఆయురారోగ్యాల కోసం ఇంకా జల్లెడ నుంచి చంద్రుడిని చూస్తారా?
జైపూర్: కర్వాచౌత్ నాడు భారతీయ మహిళలు జల్లెడ ద్వారా చంద్రుడిని చూసి తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు నిర్వహించడం దురదృష్టకరమని రాజస్తాన్ మంత్రి గోవింద్ రామ్ మేఘవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైన్స్ ప్రపంచంలో బతుకుతూ ఉంటే, మన దేశంలో జల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తూ భర్త ఆయుష్షు కోసం పూజలు చేస్తున్నారని మరి ఆ భర్తలు భార్యల కోసం జల్లెడలోంచి ఎప్పుడూ చంద్రుడిని చూడలేదని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎందరో భారతీయ మహిళలు విమాన పైలెట్లుగా ఉన్నారని, కల్పనా చావ్లా వంటి వారు అంతరిక్షంలోకి వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌లాల్ శర్మ గుర్తు చేశారు. -
చంద్రుడిని అన్ని కోణాల్లో చూడొచ్చు
బీజింగ్: చంద్రుడిని 360 డిగ్రీల కోణంలో చూపడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. కెమెరా పాయింటింగ్ సిస్టమ్(సీపీఎస్) అనే అధునాతన పరికరం సాయంతో కెమెరా కదలికల్ని ఒడిసి పట్టుకుని ఈ ఘనతను అందుకున్నారు. ప్రొఫెసర్ కాయ్ ల్యూన్గ్ యుంగ్ ఆధ్వర్యంలో హాంగ్‌కాంగ్ పాలిటెక్నిక్ వర్సిటీ, చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఈ ఆవిష్కరణకు ఊపిరిపోశాయి. 2.8 కేజీలు ఉండే ఈ సీపీఎస్ 85 సెంమీ, 27 సెంమీ, 16 సెంమీ. కొలతలు కలిగి ఉంటుంది. నిలువుగా 120 డిగ్రీలు, అడ్డంగా 340 డిగ్రీల కొలతలతో ఇది ఫొటోలు తీస్తుంది. ఎలాంటి ఉష్ణోగ్రతల పరిస్థితుల్లో అయినా పనిచేయం దీని ప్రత్యేకత. -
నాలుగు గంటల్లో చంద్రుడి వద్దకు!
-
నాలుగు గంటల్లో చంద్రుడి వద్దకు!
‘వార్ప్ డ్రైవ్’ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన నాసా హైదరాబాద్: అందాల చందమామ మనకు ఇక పక్క ఊరి చుట్టం కాబోతున్నాడు! భూమికి దాదాపు 3.84 లక్షల కి.మీ దూరంలోని జాబిల్లి వద్దకు మనల్ని కేవలం నాలుగు గంటల్లోనే తీసుకె ళ్లి దిగబెట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) అభివృద్ధి చేస్తోంది. ప్రయోగాల్లో భాగంగా ఆ సంస్థ ‘కాంతివేగాన్ని అందుకునే స్థాయిలో’(వార్ప్ డ్రైవ్) వెళ్లే ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూక్ష్మతరంగాల ఒత్తిడి, సౌరవిద్యుత్‌తో పనిచేసే ఈ విధానం సాకారమైతే రోదసీ ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. టన్నుల కొద్దీ ఇంధనాన్ని మోసుకెళ్లాల్సిన కష్టం తప్పుతుంది. రాకెట్లు, వ్యోమనౌకలు కాంతివేగం స్థాయిలో రోదసిలోకి దూసుకెళ్లగలవు. ఉపగ్రహాల సైజు కూడా సగానికి సగం తగ్గుతుంది.! పనిచేసేది ఇలా.. మూసేసిన కంటైనర్‌లో సూక్ష్మతరంగాల(మైక్రోవేవ్)లతో ఒత్తిడి కలగజేస్తారు. దీంతో వ్యోమనౌక దూసుకెళ్తుంది. సూక్ష్మతరంగాలకు సౌర విద్యుత్ అందుతుంది కనుక వేరే ఇంధనం అవసరముండదు. ఎలక్ట్రోమేగ్నటిక్ డ్రైవ్(ఈఎం డ్రైవ్) వ్యవస్థ ద్వారా విద్యుత్ శక్తిని ఒత్తిడిగా మారుస్తారు. భౌతికశాస్త్ర సూత్రం ప్రకారం.. ఏదైనా కదలాలంటే బాహ్య చోదక శక్తి కావాలి. అందుకే రాకెట్లకు ప్రొపెలెంట్లను అమరుస్తారు. ఈఎం డ్రైవ్‌లో ప్రొపెలెంట్ల అవసరం ఉండదు. శూన్యం ఆవరించి ఉండే అంతరిక్షంలో ఈ విధానం పనిచేయదని శాస్త్రవేత్తలు ఇదివరకు భావించారు. అయితే సాసా శూన్యంలో జరిపిన పరీక్షలో ఇది సాధ్యమేనని తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దానిపై నాసా ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. లండన్‌కు చెందిన శాస్త్రవేత్త రోగర్ సాయెర్ 2009లో ఈ విధానాన్ని ప్రతిపాదించారు. అయితే అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. చైనా శాస్త్రవేత్తల బృందం మాత్రం 2009లో ఈ విధానం ద్వారా 72 గ్రాముల ఒత్తిడిని సృష్టించిందని వార్తలు వచ్చాయి. -
చందమామకు ఆవలి వైపు...
చందమామను మన ం ఎప్పుడూ ఒకేవైపు చూస్తుంటాం. భూమి ఆకర్షణ శక్తి వల్ల చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూనే 29.5 రోజులకు ఓసారి భూమి చుట్టూ తిరగడం వల్ల.. మనకు ఎప్పుడూ ఒకవైపే కనిపిస్తుంటాడు. నల్లటి మచ్చలు.. ముసలమ్మ.. ఓ కుందేలు.. ఎవరికిష్టమైనవి వారు ఊహించేసుకుంటున్నాం. అయితే.. చందమామ ఆవలి ముఖంపై ఏముంది? అన్న మిస్టరీ వీడిపోయి శనివారం నాటికి 55 ఏళ్లు అయ్యాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో.. చంద్రుడి అవతలి వైపు రూపానిదే. చంద్రుడి అవతలి రూపాన్ని 1959, అక్టోబర్ 4న రష్యన్ వ్యోమనౌక లూనా-3 ఫొటో తీసింది. అంతరిక్షంలోకి తొలి ఉపగ్రహం ‘స్పుత్నిక్’ను పంపి రెండేళ్లు అయిన సందర్భంగా.. రష్యా లూనా-3ని నింగికి పంపింది. కానీ.. లూనా-3లో ఉన్న కెమెరా ఫిల్మ్ డెవలప్మెంట్ వ్యవస్థ అనుకున్నంత బాగా పనిచేయలేదు. రేడియో తరంగాల ద్వారా చిత్రాలను భూమికి పంపడంలోనూ నాణ్యత దెబ్బతిని మొత్తానికి అస్పష్ట చిత్రాలు.. తర్వాత ఎట్టకేలకు స్పష్టమైన చిత్రాలు అందాయి. ఇంకేం.. చంద్రుడి అవతలి రూపాన్ని చూసిన పదేళ్లకే మనిషి అక్కడ పాదం మోపాడు!