లండన్ : బ్రిటన్‌కు చెందిన 24 ఏళ్ల లియా అనే యువతి ఇటీవల తన శీలాన్ని 50వ దశకంలో ఉన్న ‘టోరీ ఎంపీ (బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు)’కి 1.3 మిలియన్ పౌండ్ల (దాదాపు పది కోట్ల రూపాయలు)కు విక్రయించినట్లు వెల్లడించారు. ‘సిండరిల్లా ఎస్కార్ట్స్’ వెబ్‌సైట్ ద్వారా తన శీలాన్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టగా మంచి ధరతో ఓ టోరీ ఎంపీ ముందుకు వచ్చారని, ఆయనతో రెండు నెలలపాటు డేటింగ్ చేశాక, తన కన్యత్వాన్ని అర్పించానని లియా తెలిపారు. తన తల్లి అనుమతితోనే తాను శీలాన్ని అమ్ముకున్నానని, ప్రేమించి భగ్న పడేకన్నా ఇలా డబ్బులకు కన్యత్వాన్ని అమ్ముకోవడం మంచిదంటూ అమ్మ ఇచ్చిన సలహా తనకు ఎంతో నచ్చిందని ఆ యువతి తెలిపారు.
తాను కన్యత్వాన్ని పోగొట్టుకున్నాక, తనకు ఎంతో స్వేచ్ఛ లభించిందన్న భావం కలిగిందని, గుండెల మీది నుంచి ఎంతో భారం దిగిపోయిన ట్లు కూడా అనిపించిందని లియా అతి ఉత్సాహంగా చెప్పారు. ఈ డబ్బుతో తాను లండన్‌కు సమీపంలో ఓ ఇంటిని కొనబోతున్నానని, మిగిలిన డబ్బుతో ‘ప్రాపర్టీ బిజినెస్’ చేయాలనుకుంటున్నానని ఆమె తెలిపారు. తాను కన్యత్వాన్ని అర్పించిన వ్యక్తి మంచి మర్యాదస్తుడని, బాగా చదువుకున్న వాడని, ఆయనకు లండన్‌లో మంచి పరిచయాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తితో గడపడం ఓ మంచి అనుభవమని లియా ‘ఫిమేల్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఎవరో తెలియని వ్యక్తితో ఏకాంతంగా గడిపి ఆశాభంగం పొందడం కన్నా ఈ అనుభవం తనకు బాగా అనిపించిందని ఆమె చెప్పారు. ఆమె తాను ఎందుకు కన్యత్వాన్ని అమ్ముకోవాలనుకుంటుందో ‘సిండ్రిల్లా ఎస్కార్ట్స్’కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆమె ముందుగానే వివరించారు. అజర్ బైజాన్‌కు చెందిన మహబూబా మహ్మమ్మద్‌జాదా అనే ఓ మోడల్ కన్యత్వాన్ని కూడా ఇటీవల తాము టోక్యోలోని ఓ రాజకీయ నాయకుడికి విక్రయించినట్లు సిండరెల్లా ఎస్కార్ట్స్ తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment