30 ఏళ్ల తర్వాత ఆ రహస్య చీటీలు‌ చూసి..   | Woman Found Secret Notes Of Childhood After 30 Years | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల తర్వాత ఆ రహస్య చీటీలు‌ చూసి..  

Published Sun, Jun 21 2020 12:59 PM | Last Updated on Sun, Jun 21 2020 1:08 PM

Woman Found Secret Notes Of Childhood After 30 Years - Sakshi

1987లో ఆండ్రూ రాసిన నోట్‌

లండన్‌ : ఓ మహిళ తన మూడేళ్ల ప్రాయంలో తోబుట్టువులతో కలిసి ఇంటి గోడలో దాచి పెట్టిన రహస్య చీటీలు 30 ఏళ్ల తర్వాత కంటబడ్డాయి. దీంతో చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు కదిలి ఆమె కంటతడి పెట్టుకుంది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌, గ్యుసెలీకి చెందిన కింబర్‌లీ కోల్‌బెక్‌కు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె తోబుట్టువులు ఆండ్రూ, క్రిస్టోఫర్‌లు ఓ కాగితంపై ‘‘ ఈ నోట్‌ రాసింది.. ఆండ్రూ 12, క్రిస్టోఫర్‌ 8, కింబర్‌లీ 3.. 28-7-1987లో’’ అని రాసి దాన్ని చిన్న గాజు బాటిల్‌లో పెట్టి తమ కిచెన్‌లోని గోడలో దాచారు. తర్వాత వారు ఆ ఇంటినుంచి వేరే చోటుకి మారిపోయారు. ( ఈ ఆట పేరేంటో మీకు గుర్తుందా?)

కిచెన్‌లో బయటపడ్డ గాజు సీసా అందులోని కాగితాలు

అలా 33 ఏళ్లు గడిచిపోయాయి. ఆ ఇంటిలో నివాసముంటున్న వారు కిచెన్‌ని పునరుద్ధరిస్తుండగా 33ఏళ్ల నాటి గాజు బాటిల్‌ కనిపించింది. అందులోని కాగితాలు చాలా పాతవని తెలిసి వాటిని ఫేస్‌బుక్‌లో ఉంచారు. ఓ రోజు ఫేస్‌బుక్‌లో తమ పాత జ్ఞాపకాలకు సంబంధించిన వాటిని చూసి కిమ్‌ ఆశ్చర్యపోయింది. బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుని కంటతడిపెట్టింది. ప్రస్తుతం క్యాసిల్‌ పోర్డ్‌లో ఉంటున్న ఆమె పాత ఇంటికి వెళ్లి వాటిని తనతో పాటు తెచ్చేసు​కుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement