ఇప్పటి వరకు నీటిపై తేలియాడే ఇళ్లు చూశాం.. హోటళ్లు చూశాం.. చిన్న చిన్న విల్లాలను కూడా చూశాం కానీ.. ఇప్పుడు ఏకంగా నీటిపై తేలియాడే దేశాన్నే చూడబోతున్నాం. ఎక్కడంటే పసిఫిక్ మహాసముద్రంలో 2022 నాటికి నిజం కానుంది. దేశం ఏంటి తయారు చేయడం ఏంటని అవాక్కవుతున్నారా..? అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, పేపాల్ కంపెనీ యజమాని పీటర్ థీల్ ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. తొలుత ఈ దేశంలో 300 ఇళ్లను పాలినేసియా దేశం సాయంతో నిర్మించనున్నారు. ఈ దేశానికి ‘వేరియాన్’ అనే సొంత క్రిప్టోకరెన్సీని కూడా ఏర్పాటు చేసుకోనున్నారు. పైగా ఈ దేశానికి సరిహద్దు సమస్యలు, ప్రపంచ వాణిజ్య సమస్యలు ఉండబోవని రాజకీయ విశ్లేషకుడు నథాలీ మెజా గార్సియా పేర్కొన్నారు. భవిష్యత్తులో వాతావరణ మార్పుల కారణంగా నివాసాలు కోల్పోయే శరణార్థులకు ఆశ్రయం కల్పించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక్కడ నిర్మించబోయే ప్రతి ఇల్లు కూడా పర్యావరణ హితంగా, వెదురు చెట్ల కర్రలతో నిర్మిస్తారని చెబుతున్నారు. చూద్దాం ఈ తేలియాడే దేశం కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందో లేదో..!
Comments
Please login to add a commentAdd a comment