సాక్షి, యలహంక /బొమ్మనహళ్లి : కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరు పోలీసుల వినూత్న ఆలోచనకు హర్షం వ్యక్తమవుతోంది. యలహంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దొంగతనాలకు సంబంధించి రికవరి అయిన బంగారు సొత్తును పోలీసులు సొంతదారుల ఇళ‍్ళకు వెళ్లి ఇవ్వడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది.
కోర్టు అనుమతితో సీఐ మంజేగౌడ, సిబ్బంది కలిసి సోమవారం తొలిజామున యలహంకలో ఉన్న వెంకటేశ్వర్లు దంపతులు ఇంటికి వెళ్లి వారికి ఇంటిలో గతంలో చోరీ జరిగిన బంగారు నగలు ఇచ్చారు. దీంతో వారికి ఆనందానికి అవధులు లేవు. అదేవిధంగా బొమ్మనహళ్లి పరిధిలో సీఐ రాజేశ్ తన పీఎస్ పరిధిలో ఉంటున్న నంద కిషోర్ ఇంటికి వెళ్లి రూ. 3 లక్షల బంగారు నగలు అందజేశారు. నందకిషోర్ ఇంటిలో ఇటీవల చోరీ జరిగింది. అర్ధరాత్రి చోరీకి గురైన నగలు ఇంటికి రావడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. ఈ సందర‍్భంగా బాధితులు పోలీసులను అభినందనలతో ముంచెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment