
ప్రతీకాత్మక చిత్రం
నేను ఓ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. తను నా టెన్త్ క్లాస్‌మేట్. ఇద్దరం ఒకే ట్యూషన్‌కు వెళ్లేవాళ్లం. అప్పుడు నాకు ఏమీ అనిపించేది కాదు. ప్రతిరోజూ ఇద్దరం సరదాగా గొడవపడేవాళ్లం. అప్పుడు కూడా తెలియదు ఆ అమ్మాయి అంటే నాకు అంతఇష్టం అని. నా టెన్త్ క్లాస్ ముగిసింది. నేను ఓ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. తను వేరే కాలేజ్. అప్పుడు నాకు తెలియకుండానే తన మీద ప్రేమ మొదలైంది. ప్రతిసారీ ఏదో తెలియని హ్యాపీనెస్! వాళ్ల ఇళ్లు మా ఇంటి వెనుక. తనతో ఎన్నిసార్లు మాట్లాడినా ప్రేమ విషయం చెప్పటానికి ధైర్యం ఉండేది కాదు. అలా ఆరేళ్లు గడిచాయి. తనను ఇష్టపడుతూనే ఉన్నా. మొత్తానికి బీటెక్ కంప్లీట్ అయ్యింది. నేను ఒక చిన్న ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అయ్యా. మొత్తానికి తన ఫోన్ నెంబర్ సంపాదించా. మెసేజ్‌లు చేస్తుండేవాడ్ని. మొదట్లో రిప్లై ఇచ్చేది కాదు. తర్వాత మెసేజ్‌లు చేయటం మొదలు పెట్టింది.
కొన్ని నెలల తర్వాత ఆమెకు నేను ప్రపోజ్ చేశా. ఒకే చెప్పింది. లైఫ్‌లో ఏదో సాధించాననే ఫీలింగ్. చాలా హ్యాపీగా ఉండేవాళ్లం. అప్పటినుంచి ఒక నెల తర్వాత వాళ్లింట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కామన్ ప్రాబ్లమ్! కులం అడ్డొచ్చింది. మా కన్నా వాళ్లది కొద్దిగా తక్కువ కులం. వాళ్ల అమ్మ గారితో మాట్లాడి ఎలాగైతేనేం ఒప్పించగలిగా. తర్వాత ఈ విషయం మా ఇంట్లో తెలిసింది. పెద్ద గొడవ చేశారు. నువ్వు తనని చేసుకుంటే మేము చనిపోతాం అని. అయినా నేను భయపడలేదు. ఎందుకంటే అప్పటికి ఇద్దరం మేజర్స్. నేను ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నా. తను డిగ్రీ కంప్లీట్ చేసింది. తనని లైఫ్‌లాంగ్ హ్యాపీగా చూసుకోగలనన్న నమ్మకం వచ్చింది.
తనకు ఈ విషయం చెప్పా. ఎక్కడికైనా పోయి పెళ్లి చేసుకుందాం అన్నా. తర్వాత మా ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారని చెప్పా. కానీ, తను దానికి ఒప్పుకోలేదు. నన్ను మర్చిపో అని ఈజీగా అనేసింది. తనకు వేరే అబ్బాయితో పెళ్లి అయిపోయింది. కానీ, తర్వాత ఒక మూడు నెలలు పిచ్చివాడిని అయిపోయా. తనను మర్చిపోలేకపోతున్నా. పగలు రాత్రి తేడా లేకుండా తన గురించే ఆలోచిస్తున్నా. తర్వాత హైదరాబాద్‌లో జాబ్ వచ్చి వెళ్లిపోయా. చాలా మ్యాచెస్ రిజెక్ట్ చేశా. ఈ మధ్యలో మళ్లీ తనకి మెసేజ్ చేశా. తను మెసేజ్ చేస్తుంది. కానీ, అది తప్పు అని నాకు తెలుసు! అందుకే తన నెంబర్ డిలేట్ చేశా! నా ఫోన్ నుంచి.. నా లైఫ్‌నుంచి!!!
- బాబు, రాజమండ్రి
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment