
ప్రతీకాత్మక చిత్రం
అవి నేను డిగ్రీ చదివే రోజులు. తను నాకంటే వన్ ఇయర్ జూనియర్! పేరు దియా. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. నా ఎక్షామ్స్ అయిపోవడం వల్ల నేను కాలేజీ నుండి వచ్చేశాను. తను ఫైనల్ ఇయర్ అవడం వల్ల అక్కడే ఉంది. ఆ టైంలో మొబైల్‌లు లేవు. నేను హైదరాబాద్ వచ్చాను. తను కోదాడలో ఉంది. రోజూ తన జ్ఞాపకాలే.. తనతో ఉన్న ఫీలింగ్స్‌తో గడిపేవాడిని. ఒక రోజు తనని కలుద్దామని వెళ్లాను. తను ఉండే చోటుకి వెళితే రూమ్ ఛేంజ్ అయిందని తెలిసింది.
బాగా తిరిగి, తిరిగి అడ్రస్ కనుక్కున్నాను. తలుపు తట్టగానే తను డోర్ ఓపెన్ చేసింది. అక్కడ నన్ను చూసి షాక్ అయింది. ‘మార్నింగ్ నుండి అనుకుంటున్నాను. నువ్వు వస్తావని’ అన్నది. అపుడు అనిపించింది! లవ్ అంటే ఇదే కదా అని. తన డిగ్రీ కంప్లీట్ అయింది. వాళ్ల ఇంట్లో తనకి మ్యారేజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. తను నాకు కాల్ చేసింది. నాకు మ్యారేజ్ సెట్ అయింది ఏం చేయమంటావ్ అని. ‘నాకు జాబ్ లేదు, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోలేను’ అని అన్నాను.
కాల్ కట్ చేసి మూడు నెలల తరవాత కాల్ చేసింది. ‘నాకు ఇంకో గంటలో పెళ్లి నన్ను తీసుకెళ్లు’ అని చెప్పింది. నేను అప్పుడు బెంగళూరులో ఉన్నాను. తనకి మ్యారేజ్ అయిపోయింది. నా ఫోన్ పోయిందని, వేరే నెంబర్ తీసుకున్నాను. తను సింగపూర్ వెళ్లిపోయింది. నా ఓల్డ్ నెంబర్ ఒక అమ్మాయి ఆక్టివేట్ చేసుకుంది. ఆ అమ్మాయికి నేను కాల్ చేసి చెప్పాను. ఏదో ఒక రోజు తను నాకు కాల్ చేస్తుంది. నా న్యూ నెంబర్ తనకు ఇవ్వమని. తను సరేనని ఒప్పుకుంది. తన కాల్ కోసం ఎనిమిది సంవత్సరాల నుండి వేయిట్ చేస్తున్నాను. ఎక్కడ ఉన్నా తను హ్యాపీగా ఉండాలి.
ప్రేమతో...
అంజి
చదవండి : మిస్సింగ్ యూ నాగ్, వచ్చే జన్మకైనా..
పేరేంటి! ఫోన్ నెంబర్ కూడా చెబుతా..
Comments
Please login to add a commentAdd a comment