
ప్రతీకాత్మక చిత్రం
నేను ఇంటర్ చదువుత్ను రోజుల్లో కొద్దిగా డెవోషనల్‌గా ఉండేవాడిని. ఆ క్రమంలో ఓ అమ్మాయి మీద ఇష్టం ఏర్పడింది. తను కూడా డెవోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనేది. అయితే ఓ రోజు తనను చూస్తూ అలా ఉండిపోయాను! ఎందుకో తెలీదు. తనకు ప్రేమ గురించి తెలిసే వయసుకూడా కాదు. కానీ, తన అల్లరి, చిలిపిగా ఉండే పద్ధతి నన్ను ఆకట్టుకుంది. కొంతకాలానికి చాలా సార్లు తనకు ఐ లవ్ యూ అని చెప్పినా సరిగ్గా పట్టించుకునేది కాదు. కానీ మళ్లీ మాతో సరదాగానే ఆడుకుంటుండేది. అయితే ఓ సారి మా ఇంట్లో ఓ కార్యక్రమం జరిగింది. దీంతో తను ఆ రోజు రాత్రి మా ఇంట్లో ఉండిపోయింది. ఎందుకంటే తను నా చెల్లెలి ఫ్రెండ్. అయితే ఆరోజు నేను ఎంతగా తనను ప్రేమిస్తున్నానో తెలియజేశాను. అప్పటినుంచి తను కూడా నన్ను ప్రేమించటం మొదలుపెట్టింది. కొద్దికాలానికి వాళ్ల ఇంట్లో మా ప్రేమ విషయం తెలిసిపోయింది.
చాలా రహస్యంగా మాట్లాడుకునే వాళ్లం. ఈ విషయం తెలిసి ఆమెను కొట్టి వేరే ఊరికి పంపించేశారు. ఇద్దరి వైపు పెద్దవాళ్లను ఒప్పించి ఓ నిర్ణయానికి వచ్చాము. లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తామని అన్నారు. ఓ రోజు హఠాత్తుగా తను నా దగ్గరకు వచ్చింది. లేచిపోయి వెళ్లిపోదామని అంది. కానీ నేను తనను వెనక్కు పంపించేశాను. తనను తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకోవటానికి నాకు ఉద్యోగం లేదు. దానికి తోడు వాళ్ల నాన్న రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. అందుకే కొద్దిగా వెనకడుగు వేశాను. నాకు వాళ్ల కుంటుంబం పరువు తీయటం ఇష్టం లేదు. ఒక్కర్తే కూతురు. అందుకే తనను ఒప్పించాను. వెనక్కు పంపించేశాను. తర్వాత నేను ఫారెన్ వెళ్లాను. తను కూడా చదువుకోవటానికి వేరే ఊరు వెళ్లింది. ఒక నెల తర్వాత తన ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. చాలా టెన్షన్ పడ్డాను.
పిచ్చిపట్టినట్లు అయ్యాను. కొంత కాలానికి తను ఉంటున్న బంధువుల ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేశాను. తను మాట్లాడలేదు. తర్వాత తను హాస్టల్‌లో ఉంటుందని తెలిసి హాస్టల్‌కు ఫోన్ చేశాను. అయితే తను ఫోన్ లిఫ్ట్ చేసి ‘నీకు అంతా తర్వాత చెప్తాను. ప్లీజ్ హాస్టల్‌కు కాల్ చేయకు.’ అని ఫోన్ పెట్టేసింది. ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత ఆమె ప్రవర్తన నన్ను చాలా బాధించింది. సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. మానసిక క్షోభ అనుభవించాను. తర్వాత దేవుడికి దగ్గరయ్యాను. ఆ బాధనుంచి బయటపడగలిగాను. 2010లో మా ఇంట్లో వాళ్లు నన్ను పెళ్లి చేసుకోమని బలవంతపెట్టారు. కానీ, నేను సింగిల్‌గానే ఉంటానని చెప్పాను. మా ఫాదర్ ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. ఈ జీవితంలో నేను సుఖంగా లేకపోయినా ఈ జీవితం నా తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇవ్వాలని నిర్ణయించాను.
పెళ్లికి ఒప్పుకున్నాను. అది కూడా ఒక పేదింటి అమ్మాయిని చేసుకుని మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నాను. అనుకున్నట్లుగానే పెళ్లి కుదిరింది. అయితే రేపు పెళ్లి అనగా పెళ్లికి ముందు రోజు మా చెల్లిలికి ఫోన్ వచ్చింది. పెద్దషాక్! తను ఫోన్ చేసింది. తర్వాత నాతో ఒక మాట చెప్పాలంది. తను ఎందువల్ల అలా చేసిందో.. తనను వాళ్ల పేరెంట్స్ సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు చేసి ఎలా మనసు మార్చారో వివరించింది. నా పరిస్థితి ఎండిపోయి పొట్టుగా తేలిపోయే విత్తనానికి తడి తగిలి మళ్లీ మొలకెత్తడానికి సిద్దమైనట్లు అయ్యింది. కానీ, ఒక్క రోజులో పెళ్లి.. హఠాత్తుగా పెళ్లి ఆగిపోతే నావల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మేమిద్దరం పెళ్లిచేసుకుంటే మా రెండు ఫ్యామిలీస్ ఇబ్బందిపడతాయి. అందుకే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాను. కానీ, ఓకటే ఆలోచన.. నేను ప్రేమించిన అమ్మాయి పరిస్థితి ఏంటి అని. ఆ తర్వాత నాకు నా భార్యకు మధ్య గొడవలు వచ్చాయి. నేను మళ్లీ ఫారెన్‌కు వెళ్లిపోయాను. నా భార్య ఇండియాలోనే ఉండిపోయింది. అయితే ఒక రోజు సడెన్‌గా ఒక న్యూస్ తెలిసింది. నేను ప్రేమించిన అమ్మాయి కూడా పెళ్లి చేసుకుందని తెలుసుకున్నాను. ఇప్పుడు తనకు ఇద్దరు పిల్లలు. హ్యాపీగా ఉంది. నాకు కూడా ఇద్దరు పిల్లలు పడవ ప్రయాణంలా జీవితం కొనసాగుతోంది.
- చిన్నూ
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment