
ప్రతీకాత్మక చిత్రం
ప్రేమంటే అందరికి మర్చిపోలేని అనుభూతి. కానీ, నా జీవితంలో అదే ప్రేమ చేదును మిగిల్చింది. నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు నేను ఒక అబ్బాయి నవ్వంటే ఇష్టపడేదాన్ని. తను నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. కానీ, అది ప్రేమించే వయసుకాదు, అందుకే అతడి ప్రేమను అంగీకరించలేదు. ఇక అప్పటినుంచి అతడు నాతో మాట్లాడటం మానేశాడు. నేను కూడా అతడితో మాట్లాడలేదు. తర్వాత మా స్కూల్ లైఫ్ కంప్లీట్ అయ్యింది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఒకసారి కలిశాం. టెన్త్ ఫ్రెండ్స్ గెట్‌టుగెదర్‌లో. మళ్లీ తను నాతో ‘నువ్వుంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను నిన్ను తప్ప వేరే అమ్మాయిని లవ్ చేయలేదు’ అని చెప్పాడు.
అప్పుడు తను ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు. నేను ఎంసీఏ చేస్తున్నాను. అతని లవ్ నిజం అనిపించింది. నేను తన లవ్‌ని అంగీకరించా. మా పేరేంట్స్‌ని కూడా ఒప్పించాం. మ్యారేజ్ కూడా చేసుకున్నాం. నేను తనతో ఉన్నది కొద్దినెలలే అయినా ఒక జీవితానికి సరిపడేంత నమ్మకాన్ని అనుభవించా. తర్వాత తెలిసింది తను కావాలనే నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి నన్ను పెళ్లి చేసుకున్నాడని. అప్పటినుంచి ప్రతిరోజూ గొడవలు జరిగేవి! బాగా కొట్టేవాడు. మా పేరెంట్స్‌తో మాట్లాడించేవాడు కాదు. ఓ సంవత్సరం పాటు అతడి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్నా.
ఇప్పుడు జీవితంలో ఏమీ లేదు! అంతా జీరో. నమ్మించి ఎందుకలా మోసం చేయాలి. ప్రేమించి పెళ్లి చేసుకుని అతను నా జీవితంతో ఆడుకున్నాడు. ఎన్ని రోజులు ఏడిచానో నాకు మాత్రమే తెలుసు. నా బాధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మాది కులాంతర వివాహం. ఇప్పుడు తను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. కానీ, నేను అలా చేయలేకపోతున్నాను. లవ్ చేసే అబ్బాయి మనకు కరెక్టా.. కాదా.. అని తెలుసుకుని లవ్ చేయండి! పెళ్లి చేసుకుని నాలా బాధపడకండి.
- రాధ, ఖమ్మం
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment