సారీ! మా ఇంట్లో మన ప్రేమ విషయం... | Breakup Love Story Telugu Still I Loves Her Eswar Laxmipuram | Sakshi
Sakshi News home page

సారీ! మా ఇంట్లో మన ప్రేమ విషయం...

Nov 17 2019 10:31 AM | Updated on Nov 17 2019 2:08 PM

Breakup Love Story Telugu Still I Loves Her Eswar Laxmipuram - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఎందుకో నాలో తెలియని అహంకారం మొదలైంది. నా మీద నాకే కోపం వచ్చింది...

అప్పుడే స్కూల్‌ లైఫ్‌ ముగిసి కాలేజ్‌ లైఫ్‌ మొదలైంది. మదిలో ఏదో ఆనందం. కాలేజ్‌లోకి అడుగుపెట్టగానే ఏదో మెరుపు వచ్చి తగిలినట్లు నాకు అనిపించింది. చూస్తే అది ఒక అమ్మాయి చిరునవ్వు. అలా ప్రతి రోజు ఆ చిరునవ్వు చూడటానికి కాలేజ్‌కు వెళ్లేవాడిని. ఆమె చిరునవ్వు చూస్తూ ఓ సంవత్సరం వేస్ట్‌ అయ్యింది. ఏదో తెలియని ఫీలింగ్‌.. ఆ అమ్మాయితోచెప్పలేకపోతున్నాననే బాధ. ఆ అమ్మాయి ఎందుకు బయటపడట్లేదు అనే ఆలోచన. అలా ఒకరిని ఒకరం చూసుకుంటూ ఆరు నెలలు గడిపాము. ఎందుకో నాలో తెలియని అహంకారం మొదలైంది. నా మీద నాకే కోపం వచ్చింది. నా ప్రేమను చెప్పలేకపోతున్నాననే బాధతో ఓ రోజు ధైర్యం చేసి ఆ అమ్మాయికి నా మనసులో మాట చెప్పకనే చెప్పా. అప్పుడు ఆ అమ్మాయి నాతో అన్న మాట ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. ‘16 నెలలు పట్టిందా ఈ విషయం చెప్పటానికి’ అని అడిగింది.

నవ్వుతూనే.. ‘నిజంగా నేను కూడా నీతో ఈ మాట చెప్పించటానికి ఇంత టైం తీసుకుంటున్నందకు సారీ’ అని చెప్పి, నేను చెప్పిన మాటే మళ్లీ నాకు చెప్పి వెళ్లిపోయింది. తర్వాత నా సంతోషానికి హద్దులు లేవు. అంత ఎంజాయ్‌ చేశా. అలా లవ్‌ చేసుకుంటూ ఓ సంవత్సరం చాలా వేగంగా గడిచిపోయింది. తర్వాత డిగ్రీ జాయిన్‌​ అయ్యాం. అదే కాలేజీలో రెండు నెలలు కలిసి చదివాం. సడెన్‌గా షాక్‌! ‘సారీ మా ఇంట్లో మన ప్రేమ విషయం తెలిసిపోయింది’ అని చెప్పింది. తర్వాత ఆ అమ్మాయిని వైజాగ్‌లోని కాలేజ్‌లో జాయిన్‌ చేశారు. అప్పుడు దూరమైన అమ్మాయిని ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను చూడలేదు. చాలా సార్లు ట్రై చేశా కానీ, ఆ అమ్మాయిని చూడలేకపోయా. ఐ మిస్‌ యూ బంగారం.
- ఈశ్వర్‌, లక్ష్మీపురం

చదవండి : అతడిది బట్టతల.. అందమైన అమ్మాయి కావాలి
ప్రైవేట్‌ జాబ్‌ అయితే నాన్న ఒప్పుకోరు అంది



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement