
ప్రతీకాత్మక చిత్రం
నా ప్రేమ కథ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్‌లో మొదలైంది. తను డిప్లమా చదివి మా కాలేజ్‌కు వచ్చాడు. మా ఇద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ఉండేవాడు. తను ఎప్పుడూ వాళ్ల ఫ్రెండ్ గురించి, వాళ్ల ఫ్రెండ్‌షిప్ గురించి గొప్పగా చెప్పేవాడు. అలా తనను చూడకుండానే నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత అతడు మా కాలేజ్‌లోనే జాయిన్ అవ్వటం, నాకు పరిచయం అవ్వటం చకచకా జరిగిపోయాయి. అతడ్ని చూడగానే నాకు ఒక అందమైన ఫీలింగ్ కలిగేది. అతను నాకు జీవితాంతం తోడుగా ఉండాలని దేవుడ్ని ప్రార్థించేదాన్ని. నేను అనుకున్నట్లుగానే అతడు ఫోర్త్ సెమిస్టర్‌లో నాకు బాగా దగ్గరయ్యాడు. కాలేజ్ అయిపోయే సమయానికి ఇంకా బాగా క్లోజ్ అయ్యాం. కాలేజీ చివరి రోజు అతడికి ప్రపోజ్ చేయాలనిపించింది. కేరీర్‌లో ఎదగాలని, తనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయని ఎప్పుడూ చెబుతుండేవాడు. అలా తను సెటిల్ అయ్యాక చెబుదామనుకున్నా.
తను జాబ్ కోసం బెంగళూరు వెళ్లిపోయాడు. జాబ్ కోసం బెంగళూరు వెళ్లిపోతున్నానని చెప్పిన నిమిషం చాలా బాధగా అనిపించింది. కానీ, తను సెటిల్ అయితే అంతకంటే ఇంకేమ్ కావాలి అన్న ఆశతో ఆల్ ది బెస్ట్ చెప్పి, దగ్గరుండి సెండ్ ఆఫ్ చెప్పాను. ఆ తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ వచ్చేశాను. తనకు బెంగళూరు వాతావరణం పడటం లేదని, ఉండలేనని చెప్పేవాడు. హైదరాబాద్‌కు షిఫ్ట్ అవ్వమని సలహా ఇచ్చాను. తను హైదరాబాద్‌కు రావటానికి ఒప్పుకున్నాడు. అంతా హ్యాపీగా జరిగిపోతోంది. దేవుడు నా వైపు ఉన్నాడు అనిపించింది. రెండేళ్ల తర్వాత అతడికి ఓ పెద్ద ఎమ్‌ఎన్‌సీలో జాబ్ వచ్చింది. ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఆల్ ది బెస్ట్ చెప్పటం నుంచి ఉద్యోగం వచ్చాక ఆ గుడ్ న్యూస్ నాకు చెప్పేదాక అన్నీ నేనే అయిపోయా.
రోజూ ఆఫీసుకు వేళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు, బ్రేక్ టైంలో కాల్ చేసి మాట్లాడేవాడు. చాలా కేర్‌ఫుల్‌గా చూసుకునేవాడు. నా గురించి అంత కేరింగ్‌గా ఉంటుంటే చాలా హ్యాపీగా ఉండేది. ఇంటికి వచ్చేవాడు. మా పేరెంట్స్‌తో బాగా మాట్లాడేవాడు. అంతా ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. మా ఇంట్లో అడిగారు ‘ తనంటే ఇష్టం ఉంటే చెప్పు! వెళ్లి మాట్లాడదాం’ అని. ఇక నేను తనకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ఐ లవ్ యూ చెప్పకుండా ‘మన ఫ్రెండ్ లైఫ్ పార్ట్‌నర్ అయితే ఎంత బాగుంటుందో కదా?’ అని అడిగాను ఇన్ డైరెక్ట్‌గా. నాపైన చాలా కోపం వచ్చింది. ‘ఫ్రెండ్‌షిప్‌కు లవ్‌కు చాలా తేడా ఉంది. అది తెలియకుండా ఫ్రెండ్‌ని లవర్ అని ఎలా అంటార’ని నా మీద సీరియస్ అయ్యాడు.
తన మనసులో నాకున్న విలువేంటని అడిగాను. ‘నీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అన్నీ నీతో షేర్ చేసుకునేంతగా బెస్ట్ ఫ్రెండ్‌వి. నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్‌నర్‌ను చేసుకోలేను. భార్య వేరు బెస్ట్ ఫ్రెండ్ వేరు. ఆ తేడా తెలియకుండా ఏంటి ఇలా? ’ అని అడిగాడు. నా మనసు ముక్కలైంది. ఎన్నో ఆశలతో కట్టుకున్న నా కోట కూలిపోయింది. అతని గురించి ఆలోచిస్తూ పిచ్చిదాన్ని అయిపోయా. తనతో మాట్లాడితే నాకు మళ్లీ ఫీలింగ్స్ కలుగుతాయని మెల్లగా తనతో మాట్లాడటం మానేశా. ఎప్పుడు కాల్ చేసినా బిజీ అని చెప్పేదాన్ని. నాకు నేనే శిక్ష వేసుకున్నా. ఇప్పటికీ కలుస్తూనే ఉన్నాము కానీ, అతడితో మాట్లాడలేక మౌనంగా ఉండిపోతున్నాను. నేను ఎటూ తేల్చడం లేదని ఇంట్లో వాళ్లు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇప్పటికైనా నా మనసు అర్థం చేసుకో కన్నా. ఐ లవ్‌యూ.. ఐ మిస్ యూ సో మచ్..!!
- లీలావతి, హైదరాబాద్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment