
ప్రతీకాత్మక చిత్రం
మాది వైజాగ్! చిన్నప్పటినుంచి సినిమాలంటే ఇష్టం ఉండటంతో చదువు మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ వచ్చేశా. రావటం అయితే వచ్చా కానీ, ఇక్కడ నాకు ఎవరూ తెలియదు. ఎలాగైనా హైదరాబాద్‌లోనే ఉంటూ ఏదైనా పని చేసుకుంటూ సినిమాలకు ట్రై చేద్దామనుకున్నా. జాబ్‌లో జాయిన్ అయి దగ్గరలోనే రూం తీసుకున్నా. అలా మూడు నెలలు గడిచిపోయింది. అప్పటివరకు రూం, ఆఫీసు తప్ప వేరే ప్రపంచం నాకు తెలియదు. ఒకరోజు డ్యూటీనుంచి వచ్చిన తర్వాత అమ్మ ఫోన్ చేస్తే రూం బయట నిలబడి మాట్లాడుతున్నా. నా ముందునుండి ఓ అమ్మాయి వెళుతోంది. అచ్చం దివినుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంది. ఆమెనే చూస్తూ ఉండిపోయాను. అలా చూస్తుండగానే తను మా గల్లీ దాటిపోయింది. ఊహల్లోంచి తేరుకున్న నేను తనెవరో, ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని వెంటనే తనకోసం పరుగుతీశా. తను, తన ఫ్రెండ్‌తో కలిసి మార్కెట్‌లోకి వెళ్లింది. నేను తన వెంటే వెళ్లా. ఎలాగైనా తను ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని నా ఆత్రుత. మార్కెట్‌లోంచి బయటకు వెళుతుంటే నేను వెనకాలే ఫాలో అయ్యాను.
తన ఫ్రెండ్ మధ్యలో బై చెప్పి వెళ్లిపోయింది. తను మాత్రమే నడుస్తోంది. వెనకాలే నేను. ఒకసారి వెనక్కు తిరిగి చూస్తే బాగుండు అనుకుని వేయిట్ చేస్తున్నా. తను మాత్రం ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఇంతలో నా మొబైల్ రింగ్ అయింది. ఆ సౌండ్‌కు తను వెనక్కు తిరిగి చూసింది. నా చేతిలో ఉన్న ఫోన్ జారిపోయి కింద పడింది. తను నవ్వుకుంటూ వెళ్లిపోయింది. అప్పుడు జారింది నా ఫోన్ ఒక్కటే కాదు.. నా మనసు కూడా. మళ్లీ తన వెనకాలే ఫాలో అయ్యాను. మొత్తానికి తన అడ్రెస్ కనుక్కున్నా. హఠాత్తుగా రూంకు తలుపువేయలేదన్న సంగతి గుర్తుకువచ్చింది. వెంటనే పరిగెత్తబోయాను. కానీ, తీరా చూస్తే ఆ అమ్మాయి ఇళ్లు మా ఇంటి పక్కనే ఉంది. ఒక్క క్షణం నాకేమీ అర్థం కాలేదు. తనను ఎలా పరిచయం చేసుకోవాలో అర్థం కాక నైట్ అంతా నిద్రపట్టలేదు. డైరెక్ట్‌గా మాట్లాడటం అంటే నాకు చాలా భయం. వాళ్ల ఫ్రెండ్స్‌ని ఎవరైనా ఆమె నెంబర్ అడుగుదామంటే నాకు ఎవరూ తెలియదు.
ఉదయం ఆఫీసుకు కాల్ చేసి ఫీవర్ ఉందని లీవ్ పెట్టా. మార్నింగ్ తను కాలేజ్‌కు వెళ్లే సమయంలో ఇంటి బయట నిలబడి వేయిట్ చేస్తున్నా. ఇంతలో తను బయటకు వచ్చింది. నా గుండె వేగం పెరిగింది. భయం మొదలైంది. వెయ్యికోట్లు దొంగతనం చేసి దొరికిపోయినా సరే ఇలాంటి టెన్షన్ వద్దు. ఇదేం ఫీలింగ్‌రా బాబు అనుకున్నా. ఇంతలో తన ఫ్రెండ్ వచ్చింది. తనతో నీ ఎఫ్‌బీ ఐడీ ‘పల్లవి, పల్లవి కదా?’ అంది. తను అవునంది. ‘మరి డీపీ ఏంటి ప్రభాస్‌ది పెట్టావు’ అని అడిగింది. దాహంగా ఉన్నోడికి ఒక్కసారిగా బీర్ కేస్ దొరికినట్లు అయ్యింది. ఇక వెంటనే రూంలోకి వెళ్లి, మొబైల్‌లో ఎఫ్‌బీ ఓపెన్ చేశా. బాగా వెతికి, వెతికి తన ఐడీ కనుక్కున్నా. ఆనందం తట్టుకోలేకపోయా. వెంటనే రిక్వెస్ట్ పెట్టా. ఎప్పుడు ఆక్సెప్ట్ చేస్తదా అని చూడటం మొదలుపెట్టా. మధ్యాహ్నం ఒకటి అయింది కానీ తను ఆక్సెప్ట్ చేయలేదు. అసలు ఆక్సెప్ట్ చేస్తదా చేయదా అని టెన్షన్. ఇంతలో ఎఫ్‌బీ నోటిఫికేషన్ వచ్చింది.
అది తన ఆక్సెప్ట్ అయ్యుండాలని దేవుడ్ని ప్రార్థించటం మొదలుపెట్టా. ఆ దేవుడు కనికరించాడో ఏమో నా నోటిఫికేషన్ ఆ అమ్మాయి ఆక్సెప్ట్ చేసింది. వెంటనే లేట్ చేయకుండా హాయ్ అనిపెట్టా. చూసింది కానీ, తను రిప్లై ఇవ్వలేదు. మళ్లీ హాయ్ అని పెట్టా. మళ్లీ చూసింది కానీ, రిప్లై ఇవ్వలేదు. ఏదో ఒకటి అవుతదని మళ్లీ హాయ్ అని పెట్టా. మళ్లీ రిప్లై ఇవ్వకపోవటంతో డల్‌గా ఉన్నా. ఇంతలో మెసేజ్ వచ్చింది. అది తనే. నేను రిప్లై ఇచ్చా. అలా కొంతసేపు నార్మల్‌గా మాట్లాడి ‘నేను మా పక్కింట్లో ఉంటా’ అని చెప్పా. ‘హా! తెలుసు’ అంది. ఇక నా మైండ్ బ్లాక్ ‘ నిన్న నా వెనకాల మార్కెట్ మొత్తం తిరిగావుగా’ అంది. నాకేం అర్థం కాలేదు. ‘నువ్వు ఎఫ్‌బీలో మెసేజ్ పెట్టాలనే మా ఫ్రెండ్‌తో నా ఎఫ్‌బీ ఐడీ చెప్పించా.’ షాక్ మీద షాక్! ఏమీ అర్థం కాలేదు. ‘నువ్వు నిన్నటి నుంచే చూస్తున్నావు. నేను నిన్ను మూడు నెలల నుంచి చూస్తున్నాను. ఐ లవ్ యూ’ అంది. తన నెంబర్ పెట్టి సాయంత్రం ఆరు గంటలకు ఫోన్ చేయమంది.
అప్పుడు అర్థమైంది! అమ్మాయిలు ఎంత ప్రేమ ఉన్నా అబ్బాయిలు చనువు తీసుకునే వరకు బయటపడరని. ఈవినింగ్ కాల్ చేసి మాట్లాడా. తన మాట తీరు, తను ఉండే పద్దతి అన్నీ నాకు బాగా నచ్చాయ్. చాలా దగ్గర అయ్యాం. హైదరాబాద్‌లో ఉన్న అన్ని ప్రదేశాలు తిరిగాం. ఒకరిని విడిచి ఒకరం ఉండలేకపోయేంతగా అయ్యాం. అలా ఓ సంవత్సరంనర తర్వాత ఓ రోజు మా విషయం వాళ్ల ఇంట్లో చెబుదాం అంది. నేను ధైర్యం చేసి వాళ్ల అమ్మతో చెప్పేశా. తను ఒకే అంది. అంతా హ్యాపీ ఇక నేను మా ఇంట్లో ఒప్పించటమే ఉంది. సరే నేను మా ఇంట్లో మాట్లాడతా అని ఇంటికి వెళ్లా. వాళ్లకు చెప్పా! ఒక్కడినే కొడుకును కాబట్టి వాళ్లు ఒప్పుకున్నారు. ఈ హ్యాపీ న్యూస్ తనకు చెప్పటానికి ఫోన్ చేశా. తను లిఫ్ట్ చేయగానే ఒక మాట అంది. ఆ మాట ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనిది. మీ కులం ఏంటని తను అడిగింది. నేను చెప్పా!. సరే తర్వాత చేస్తా అని తను ఫోన్ కట్టేసింది. ఐదు రోజులు గడిచించి తను ఫోన్ చేయటం లేదు.
నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మెసేజ్‌లు చేస్తే రిప్లై కూడా ఇవ్వటం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ వైపు నాన్నకు బాగోలేక 20 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ ఇరవై రోజులు తనతో మాట్లాడకుండా, చూడకుండా నలిగిపోయా. బాధని ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియలేదు. నాన్నకు తగ్గిన తర్వాత వెంటనే హైదరాబాద్ బయలు దేరాను. ఓ వైపు భయం తనకు ఏమైనా అయ్యిందేమోనని, వాళ్ల నాన్న ఏమన్నా అన్నాడా అని. ఇంటి దగ్గరకు వెళితే ఎవరూ లేరు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు. ఇంతలో తను వేరే అబ్బాయితో చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే అది చూసి ఒక్కసారిగా నా ప్రాణం పోయినట్లు అయ్యింది! అవ్వటం ఏంటి నిజంగానే పోయింది. ఏం మాట్లాడకుండా రూంలోకి వెళ్లా. ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయా.
ఇంతలో ఒక మెసేజ్ వచ్చింది. అందులో నన్ను రాత్రికి కలవమని ఉంది. నేను రాత్రి వెళ్లి కలిశాను. ఎందుకు అలా చేశావ్ అని అడిగేలోపేత ను ఇలా అంది. ‘‘ మా నాన్నకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. నీకు, నాకు సెట్ అవ్వదు. నిన్ను లవ్ చేశానని తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఉదయం నువ్వు చాశావుగా! తను మా బావ. మా ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. నేనంటే తనకు చాలా ఇష్టం. తను నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. ప్లీజ్ నన్ను వదిలేయ్!’ అని వెళ్లిపోయింది. ఎందుకు నన్ను మోసం చేశావని అడిగే సమయం కూడా ఇవ్వలేదు. నువ్వే నా ప్రాణం, నీతోనే నా లైఫ్ అన్న మాటలు ఏమయ్యాయో నాకు అర్థం కాలేదు. అమ్మాయిలు ఎంత తొందరగా లవ్ చేస్తారో అంతే తొందరగా మర్చిపోతారని అర్థం అయ్యింది. తను దూరమైన తన పేరు నా గుండెలమీద పచ్చబొట్టులా మిగిలిపోయింది.
- అజయ్, హైదరాబాద్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment