
ప్రతీకాత్మక చిత్రం
నేను పదవ తరగతి చదివేటప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశా. ఆమె అంటే నాకు ప్రేమ.. ఆకర్షణ ఏదో తెలియదు. ఆమెకు కూడా నేనంటే పిచ్చి ప్రేమ. మా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేసే వాళ్లు మాకు. చాలా రోజులు ఒకరితో ఒకరం బాగా మాట్లాడుకునే వాళ్లం. కానీ, ఆమెది మా కంటే కొంచెం తక్కువ కులం! అందుకే ఆమెను అవాయిడ్ చేయటం మొదలుపెట్టాను. ఆమె చాలా బాధపడేది. మా ఫ్రెండ్స్‌తో కాల్ చేయించేది. అలా వాళ్ల అక్కకు కూడా చెప్పింది. తను కాల్ చేసి ‘మా అక్కకు నువ్వంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకో’ అంది. అప్పుడు నేను‘‘కుదరదు! ఏదో ఆకర్షణతో అలా అనిపించింది. మాది లవ్ కాదు’’ అన్నాను. కానీ, నేను ఆమెను నేను నిజంగా ప్రేమించాను. కులం కారణంగా నేను ఆమెను వదులుకున్నాను. నేను ఎప్పటికీ బాధపడుతూనే ఉంటా. నా లైఫ్‌లో ఆమె ఒక స్వీట్ మెమొరీ. ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అవుతూ ఉంటాను. నన్ను ఎప్పుడు చూసినా ఆమె కళ్లల్లో ప్రేమ కనిపిస్తుంది. నాకు ఇప్పుడు పెళ్లైంది. తను ఇంకా చేసుకోలేదు.
- భగవాన్
చదవండి : నాతో వస్తే తను కూడా అనాథలాగా బ్రతకాలి
మగవారిని ఇబ్బంది పెట్టే అంశాలివే
Comments
Please login to add a commentAdd a comment