
ప్రతీకాత్మక చిత్రం
నేనప్పుడు 8వ తరగతి చదువుతున్నా! తను 6వ తరగతి. నాకు తనమీద అప్పుడే ప్రేమ కలిగింది. తనకు నా ప్రేమ విషయాన్ని చెప్పటానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. చాలా తిట్టింది. కాలేజీలో ఉన్నపుడు ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానంది. నేను కాదని నా ప్రేమ విషయం తనతో చెప్పాను. నా మనసులో ఆ అమ్మాయిని తప్ప వేరే ఎవరినీ ఉహించుకోలేనని అన్నాను. తన పైన ఉన్న ధ్యాసతో సరిగా చదువుకోలేదు. ఆ అమ్మాయిని ఎలాగైనా ఒప్పించాలని నా స్నేహితుడు చాలా ప్రయత్నించాడు. ఇదిలా ఉండగా ఒక రోజు తనకు పెళ్లి సంబంధం కుదిరిందని తెలియగానే చాలా ఏడ్చాను. అప్పటికి ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు కూడా నిండలేదు. తన పెళ్లికి ఇంకా 3 నెలలు సమయం ఉందనగా వెళ్లి తనని అడిగాను ‘నేనంటే ఇష్టమా.. లేదా’ అని. అప్పుడు తను ఇష్టమే అని చెప్పింది. ఆ మాట వినగానే ఎక్కడలేని సంతోషం! మాటల్లో చెప్పలేని అనుభూతి.
ఇష్టం అయితే ఇన్నిరోజులు ఎందుకు చెప్పలేదని అడిగాను. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ‘నువ్వంటే ఇష్టమే కానీ, ఈ విషయం ఇంట్లో తెలిస్తే పరువు పోతుంది’ అని ఆగాను. అలాగే వాళ్ల ఫ్యామిలీకి కూడా ఊర్లో రాజకీయంగా చాలా పేరుంది. తర్వాత తనకి పెళ్లయింది. తనని మర్చిపోలేక నేను చాలా బాధపడ్డాను. మందు, సిగరెట్ తాగటం బాగా అలవాటైంది. ఇది గమనించిన మా ఇంట్లో వాళ్లు నన్ను హైదరాబాద్‌లో ఉన్న మా బావ (చెల్లి వాళ్ల భర్త ) ఇంటికి పంపించారు. అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ తనని మర్చిపోలేక చాలా బాధపడ్డాను. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నాకు పెళ్లి సంబంధం చూసింది కూడా మా ఊర్లోనే. మా ప్రేమ విషయం ఆ అమ్మాయికి తెలుసు.
అయినా కూడా నాతో పెళ్లికి ఒప్పుకుంది. నా గురించి తెలిసి కూడా నాతో పెళ్లికి ఒప్పుకున్న ఆ అమ్మాయి కోసం పెళ్లికి ముందే నాకున్న చెడు వ్యసనాలు అన్నీ మానేశాను. ఇప్పుడు మాకు పెళ్లి జరిగి 3 సంవత్సరాలు అయిపోయింది. మాకు ఒక బాబు. మా బాబు పేరు కూడా నేను ప్రేమించిన అమ్మాయి పేరు కలిసి వచ్చేలా పెట్టాను. అయినా కూడా నా భార్య ఏమీ అనలేదు. అప్పుడు తెలిసింది. నా భార్య నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అని. నేను కోల్పోయిన ప్రేమను నా భార్య నాకు అందిస్తోంది. ఇలాంటి భార్య నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. మా ఊరు వెళ్లిన ప్రతీసారి నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ల ఇంటివైపు వెళ్తుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. ఇన్ని తెలిసినా నా భార్య నన్ను అర్థం చేసుకుంది. నిజంగా నా భార్య(భార్గవి) చాలా గ్రేట్! ఐ లవ్ యూ భార్గవి.
- గోపాల్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment