
ప్రతీకాత్మక చిత్రం
తను మా చుట్టాల అమ్మాయే.. ఓ పెళ్లిలో చూశా. చూడగానే నచ్చేసింది! లవ్ ఆట్ ఫస్ట్ సైట్. పదవ తరగతిలో ఆమె నా క్లాస్‌మేట్ అయ్యింది. తన వెనుక బెంచ్‌లో కూర్చునేవాణ్ని. వెనుకనుంచి ఆమెను చూస్తూ ఉండిపోయేవాణ్ని. ఒక ఫ్యామిలీనే అని తెలిసిన తర్వాత మాటలు కలిశాయి. తర్వాత నేను ఆమెను ప్రేమించటం మొదలుపెట్టాను. అలా ఆరునెలలు ఆమెను చూస్తూ గడిపేశాను. క్లాస్‌లో ఎవరూ లేనపుడు వెళ్లి తనతో మాట్లాడేవాణ్ని. అప్పుడు మాటలు తక్కువ.. ఒకర్ని ఒకరు చూసుకోవటమే జరిగేది. తనకు నేనన్నా.. నా అల్లరి అన్నా ఇష్టం. కొద్దిరోజులకు మా ప్రేమ విషయం అందరికీ తెలిసిపోయింది.
తర్వాత టీచర్లు తనని నన్ను టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. ఏదో ఒక కారణం చెప్పి నన్ను కొట్టడం మొదలుపెట్టారు. అలా చేసే సరికి ఆమె నన్ను చూసేది కాదు. ఈ ఆరునెలల్లో మా క్లాస్ టీచర్ కారణంగా మేము పూర్తిగా దూరమయ్యాము. నాకు టీచర్ల మీద ఉన్న గౌరవమే పోయింది. తనంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. నేను తనని తలుచుకోని రోజు లేదు. నాకు 28 తనకు 27. తనకు పెళ్లైంది! ఇద్దరు పిల్లలు. హ్యాపీగా ఉంది కావచ్చు. నాలుగేళ్ల క్రితం తన ఫొటో ఒకటి దొరికింది. తన స్నేహితులతో దిగింది. అప్పటినుంచి ఫొటోను వాలెట్‌లో పెట్టుకుని తిరుగుతున్నాను. తొలిప్రేమ ఎప్పటికీ చావదు అంటే ఏమో అనుకున్నా. ఇప్పటికీ తను గుర్తుకు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది.
ఆ రోజు స్కూల్లో అలా జరిగుండకుంటే మేము సంతోషంగా ఉండేవాళ్లం కావచ్చు. ఒకే మతం, ఒకే కులం పెళ్లికి అడ్డంకులు ఉండేవి కావు. ఆమె గురించి మా ఫ్యామిలీలో అందరికి తెలుసు. తన పేరు లాగానే తను కూడా స్వచ్ఛమైనది. మా స్నేహం, ప్రేమ అలా మధ్యలో ఆగిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. జనవరి 30న తన పుట్టిన రోజు. నా పుట్టిన రోజు అయినా మర్చిపోతాను కానీ, తన పుట్టిన రోజును మాత్రం కచ్చితంగా జరుపుకుంటాను.
- కన్నా, ముంబై
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment