నలుగురూ చూసి ఏమనుకుంటారో అని.. | Love Stories In Telugu : Krishna Sad Ending Love Story | Sakshi
Sakshi News home page

నన్ను ప్రేమించడం కుదరదంది

Published Mon, Nov 11 2019 10:19 AM | Last Updated on Mon, Nov 11 2019 10:37 AM

Love Stories In Telugu : Krishna Sad Ending Love Story - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నాది చెప్పుకోదగ్గ ప్రేమ కాదు కానీ చెప్పకుండా ఉండలేను. నేను కోదాడలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అప్పుడు నేను ఒక అమ్మాయిని చూశాను. ఆమెను చూడగానే నాలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. కానీ, అది ఆమెకు చెప్పాలంటే చాలా భయమేసింది. ఎలాగోలా భయం వదిలేసి చెప్పాను. అప్పుడు తను నాకంటే సీనియర్ అని చెప్పింది. అయినా నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పాను. తను నా ప్రేమను ఒప్పుకోలేదు. నేను ప్రేమించడం ఆపలేదు. తన చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కాలేజీకి వెళ్లడం కూడా మర్చిపోయాను. ఎగ్జామ్ రాసి వెళ్లేటప్పుడు చివరిసారిగా చూస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశాను. కానీ, చూడకుండానే వెళ్లిపోయింది. మళ్లీ డిగ్రీ ఫైనలియర్ కాలేజ్ డేస్ వచ్చాయ్. తను నాకంటే సీనియర్ కాబట్టి ప్రేమించలేదని ఎంతో బాధపడ్డాను.

తన ఫ్రెండ్స్‌ని ఆ విషయం అడిగాను. వాళ్లు చెప్పారు. తను నా మీద ఇష్టం లేక ప్రేమించడం లేదని చెప్పలేదట. నలుగురూ చూసి ఏమనుకుంటారో అని ఇష్టం లేదని చెప్పిందట. అయినా నేను పట్టించుకోలేదు తన చుట్టే తిరుగుతున్నాను. కాలేజీకి వెళ్లడం మర్చిపోయాను తర్వాత నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. మళ్లీ తర్వాత ఏమైందో ‘నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావ్’ అని అడిగింది. ‘నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు లేకుండా ఉండలేను’ అని చెప్పాను. ‘నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నేను నిన్ను ప్రేమించడం కుదరదు’ అని చెప్పింది. ‘మీ ఇంట్లో నేను ఒప్పిస్తాను! నువ్వు ఒప్పుకుంటే చాలు’ అని బ్రతిమాలాను. అయినా తను ‘నువ్వు నాకు సెట్ కావు’ అని చెప్పి వెళ్లిపోయింది.

తర్వాత తను హైదరాబాద్ ఆర్ సి రెడ్డి కోచింగ్ సెంటర్లో సివిల్స్ ప్రిపేర్ అవటానికి వెళ్లింది. నేను తనను మర్చిపోలేక పోయా కాలేజీ వదిలేసి తన దగ్గరకు వెళ్లిపోయాను. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో రూమ్ తీసుకుని తను ఉంటున్న హాస్టల్ కోసం వెతకడం మొదలు పెట్టా. అనుకోకుండా ఒకసారి దిల్‌సుఖ్‌నగర్‌లో కలిసింది. తన కోసం వచ్చానని చెప్పాను! తను ఎక్కడ ఉంటుందో చెప్పలేదు. ఆరు నెలలు గడిచింది. ఆ తరువాత తెలిసింది తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయితో కలిసి రూమ్‌లో ఉంటోందని. బాధపడాలో లేక కోప్పడాలో తెలియని పరిస్థితి నాది. ఏం చేయలేక పోయాను. తనకు ఒక మాట చెప్పాను ‘ఇప్పుడు అవసరం లేని నా ప్రేమ జీవితంలో ఇంకెప్పుడైనా నీకు ఉపయోగపడుతుంది. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు అయినా నేను ఉన్నానని గుర్తుంచుకో. ఒకసారి  నాకు ఫోన్ చెయ్’ అని నెంబర్ ఇచ్చి వచ్చేశాను.
- కృష్ణ


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement