
ప్రతీకాత్మక చిత్రం
నేను బీటెక్‌లో జాయిన్ అయిన కొద్దిరోజులకు క్లాస్‌లో ఓ అమ్మాయిని చూశా. అప్పటివరకు ఏ అమ్మాయిని కూడా చూసేవాడిని కాదు. సడెన్‌గా ఆమె ఎదురు రావటంతో చూడాల్సి వచ్చింది. దాంతో ప్రతిరోజూ ఆమె కోసం క్లాస్ మొత్తం కలియ చూసేవాడిని. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఆమెతో మాట్లాడదామని చాలా ట్రై చేసినా మాట్లాడేవాడినికాదు. అసలు నేను క్లాస్‌లో ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. అలా కొద్దిరోజులు గడిచిపోయాయి. మా ఫ్రెండ్ ఒకడు షార్ట్ ఫిల్మ్‌లో నటించమని అడిగాడు. నేనూ ఆశక్తి కొద్ది సరే అన్నాను. అప్పుడు నాలో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను కూడా సొంతంగా ఫార్ట్ ఫిల్మ్ చేద్దామనుకున్నా. కొద్దిరోజుల తర్వాత స్టోరీ రాసి మెయిన్ రోల్ లీడ్ నేనే చేశా. క్లాస్‌లో కొంతమందికి పరిచయం అయ్యా. అలా కొద్ది రోజుల తర్వాత మా క్లాస్ సీఆర్‌తో ఆ అమ్మాయి కొంచెం క్లోజ్‌గా ఉండేది.
అదే టైంలో నాకు సీఆర్ క్లోజ్ అయ్యాడు. ఒకరోజు నా బర్త్‌డేకి పెట్టే ఖర్చుతో ఓల్డేజ్ హోమ్‌లో భోజనాలు పెట్టించాలని ఫిక్స్ అయ్యా. అదే విషయం సీఆర్‌కు చెప్పా. తను కూడా అనుకోకుండా అక్కడకు వచ్చింది. ఆమె నా ఫోన్ నెంబర్ తీసుకుని నాతో ఆడుకుంది. తర్వాత నాకు నిజం చెప్పింది. నేను నా స్టేటస్ ద్వారా నా ఇష్టాన్ని ఆమెకు చెప్పే వాడిని. ఓ రోజు అడిగింది ‘ అవి నా కోసమేగా’ అని. అవునన్నా. ‘నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు. మనం ఫ్రెండ్స్ మాత్రమే’ అంది. ‘ఫ్రెండ్‌గా నేను ఉండలేను. ఎన్నిరోజులైనా ఇలానే ఉంటా’ అని చెప్పా. తర్వాత నన్ను అవాయిడ్ చేసింది. నా మీద కోపం ఎక్కువైంది.
నేను క్లాస్‌కి కూడా సరిగా వెళ్లేవాడిని కాదు. వేరే కాలేజీలో కాంపిటీషన్స్ ఉంటే అక్కడికి వెళ్లాలని అనుకున్నా. ఒక్కడినే ఎందుకని తోడు కోసం మా క్లాస్‌లో ఒకడికి చెప్పా. వాడు అమ్మాయిలతో చర్చించాడు. ఆమె కూడా క్విజ్‌కు రావాలనుకుని వచ్చింది. ఆ రోజు మొత్తం కలిసి ఉన్నాం. అక్కడినుంచి కొంచెం క్లోజ్ అయ్యాం. థర్డ్ ఇయర్‌కు వచ్చేసరికి మరింత క్లోజ్ అయ్యాం. అప్పుడు మళ్లీ నా ప్రేమ ప్రస్తావన తెచ్చా. తను కొద్దిసేపు ఆలోచించి‘ నువ్వంటే నాకు ఇష్టమే కానీ, ఇంట్లో సమస్యల వల్ల చెప్పలేకపోయా. నేను దూరంగా ఉంటే నువ్వు మర్చిపోతావనుకున్నా. నా కోసం వెయిట్ చేస్తావనుకోలేదు.’ అంది. అప్పటినుంచి ఒకరిని విడిచి ఒకరం ఉండలేదు.
- లోకేష్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment