
ప్రతీకాత్మక చిత్రం
నేను డిప్లమా సెకండ్ ఇయర్‌లో ఉన్న రోజులు అవి. ఒకరోజు మామూలుగా కాలేజ్‌కి వెళ్లే దారిలో కాకుండా వేరే దారిలో వెళుతున్నా. ఆ దారిలో ఒక అమ్మాయి నా కాలేజ్ యూనిఫాంలోనే కనిపించింది. తను కూడా మా కాలేజ్‌కే వెళుతోందనుకున్నాను. తనను చూసిన మొదటి చూపులోనే ప్రేమించటం మొదలుపెట్టాను. ఆమెకూడా నా వంక చూసింది. ఆమెతో మాట్లాడటానికి నాకు ధైర్యం సరిపోలేదు. అలా చూస్తూనే సమ్మర్ సెమిస్టర్ వచ్చేసింది. ఎఫ్‌బీలో అయినా చాట్ చేద్దామంటే తన పేరు ఏంటో కూడా తెలీదు నాకు. అసలు తనకు ఎఫ్‌బీ ఉందో లేదో తెలీదు. అలానే నాకు సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయాయి. రిజల్ట్స్ వచ్చాయి. నావి కొన్ని సబ్జెక్టులు బ్యాక్ అయ్యి ఆ ఇయర్ డ్రాప్ అయ్యాను. దాని వల్ల తనను నేను కలవ లేకపోయాను. తన చూపు నాకు బాగా గుర్తు ఉండిపోయింది. అలా మళ్లీ నా సబ్జెక్టులని క్లియర్ చేసి ఫైనల్ ఇయర్లో జాయిన్ అయ్యాను.
తను నాకు కనిపించలేదు. తన కోర్సు కంప్లీట్ అయి కాలేజ్‌లోనుంచి వెళ్లిపోయింది. తను కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో టాప్! ఆమె ఫొటోను కాలేజ్ బ్యానర్‌లో వేశారు. అప్పుడు తన పేరు తెలిసింది. అలా నేను ఎఫ్‌బీలో తన పేరు సెర్చ్ చేశాను. ఒక ఐడీ వచ్చింది. ఆ ఐడీ తనదే అని ఫ్రెండ్ రిక్వెస్ట్, ఓ మెసేజ్ పంపా. సాయంత్రం రిప్లై వచ్చింది. ఆ రోజు రాత్రి 12వరకు చాట్ చేసింది. తర్వాతి రోజు మళ్లీ మెసేజ్ పంపితే అసలు సెండ్ కాలేదు. ఎందుకని చూస్తే చాలా రిక్వెస్ట్‌లు పంపటం వలన ఎఫ్‌బీ వాళ్లు నా రిక్వెస్ట్ అండ్ మెసేజ్ ఆప్చన్‌ను ఓ వారం బ్లాక్ చేశారు. తను నా రిక్వెస్ట్ అంగీకరించకుండా మెసేజ్‌లు చేసేది. ఆ వారం మొత్తం నాకు ఓ యుగంలా గడిచింది. వారం తర్వాత మెసేజ్ పెట్టా తర్వాత వెంటనే సమాధానం వచ్చింది. ‘ ఇన్ని రోజులు ఎందుకు మెసేజ్ చేయలేదు’ అని. తను కూడా నాకు మెసేజ్ పెట్టినా సెండ్ కాలేదు. నేను తనని బ్లాక్ చేశానని అనుకుందంట.
తనకు జరిగింది మొత్తం చెప్పాను. వెంటనే తను నా నెంబర్ అడిగింది. ఆలస్యం చేయకుండా ఇచ్చేశాను. తనుకూడా తన ఫోన్ నెంబర్ ఇచ్చింది. చాటింగ్ చేసుకుంటూ బయట కలుసుకునేవాళ్లం. తనది జాయింట్ ఫ్యామిలీ అవ్వటం వల్ల తను నాతో ఫోన్‌లో మాట్లాడేది కాదు. తన గురించి అన్ని విషయాలు నాకు చెప్పేది. అలా కొన్ని రోజులకి తనకు పూణెలో బీటెక్ సీట్ వచ్చింది. తను చాలా హ్యాపీ!కానీ, నాకు చాలా బాధగా అనిపించింది. తను నాకు ధైర్యం చెప్పింది. నా కోర్సు అయిపోయాక పూణె రమ్మంది. తనను దూరం చేసుకోలేక ఫైనల్ ఇయర్ మీద శ్రధ్ధపెట్టాను. తనను కొన్ని రోజులు దూరం పెట్టా. అలా నా డిప్లమాలో మంచి పర్సెంటేజ్‌తో పాస్ అయ్యాను. తనకు మెసేజ్ చేశా. రిప్లయ్ రాలేదు. కాల్ చేస్తే కట్ చేసింది. అలా తను ఎందుకు చేస్తోందో అర్థం కాలేదు. రెండు రోజుల తర్వాత మెసేజ్ వచ్చింది ‘నీతో మాట్లాడటం ఇష్టం లేదు’ అని. అలా తను ఎందుకు అందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
తనకు ఎన్ని సార్లు కాల్ చేసినా, మెసేజ్ పెట్టినా రిప్లయ్ రాలేదు. నేను తనను మర్చిపోవాలని జిమ్‌లో జాయిన్ అయ్యాను. కెరీర్‌మీద దృష్టి సారించాను. డిప్లమాలో మంచి పర్సెంటేజ్ వచ్చింది. దీంతో నేను ఉండే ఊరిలోనే మంచి కాలేజ్‌లో బీటెక్ సీట్ వచ్చింది. బీటెక్ కూడా మంచి పర్సెంటేజ్‌తో పాస్ అయ్యా. అలానే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్‌లో మంచి జాబ్‌కూడా చేస్తున్నాను. కానీ, తనను ఇంకా మర్చిపోలేదు. ఈ మధ్య మా స్టాఫ్ మెంబర్స్‌తో ఒక పార్టీకి వెళ్తే అక్కడ కనిపించింది తను. మొదట్లో కంటే ఇప్పుడు చాలా అందంగా కనిపించింది. తనను అలా చూసే సరికి తట్టుకోలేకపోయా. మాట్లాడదామని అనుకున్నా. కానీ, ఆత్మగౌరవం అడ్డుపడింది. అలా పార్టీ మొత్తం తనను ఇగ్నోర్ చేశా. బయటకు వెళుతుండగా తను నా చెయ్యి పట్టుకుని ఐ లవ్ యూ చెప్పింది. కానీ, నాకు తన మీద నమ్మకం లేదు. ఇప్పుడు జాబ్ చూసి నన్ను లవ్ చేస్తోందని అనుకుంటున్నా. కానీ, తనపై నా ప్రేమ ఎన్నటికీ అలానే ఉంటుంది. తనను నమ్మాలో వద్దో అర్థం కావటం లేదు.
- మణికంఠ
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment