నా మనసులో అతడి రూపం, ప్రేమ శాశ్వతం | Sad Ending Telugu Love Story : I Love Him Until My Death Sravani | Sakshi
Sakshi News home page

నా మనసులో అతడి రూపం, ప్రేమ శాశ్వతం

Published Sat, Nov 9 2019 4:47 PM | Last Updated on Sat, Nov 9 2019 4:54 PM

Sad Ending Telugu Love Story : I Love Him Until My Death Sravani - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నేను పదవ తరగతి చదివేటప్పుడు ఒక అబ్బాయి మా బడిలో చేరాడు. మూడు నెలల తర్వాత నా పుట్టిన రోజున బడినుంచి ఇంటికి వెళ్లడానికి బస్టాప్‌లో ఉంటే సైకిల్‌ మీద వచ్చి చాక్లెట్‌ గిఫ్టుగా ఇచ్చి వెళ్లిపోయాడు. అది జరిగిన సరిగ్గా వారం రోజుల తర్వాత నేను అంటే ఇష్టమని చెప్పాడు. తను మంచివాడు. అందువల్ల నేను తన ప్రేమను అంగీకరించాను. మేము రోజూ ట్యూషన్‌లో, స్కూల్‌లో స్నేహితులలాగా చక్కగా ఉండేవాళ్లం. మా తరగతిలో అందరికి తెలుసు మా ప్రేమ విషయం. మేము ఏ రోజూ స్నేహాన్ని అతిక్రమించలేదు. రెండు నెలల తర్వాత ఒక స్నేహితురాలు చేసిన తప్పు కారణంగా బడిలో ప్రిన్సిపాల్‌కి, టీచర్లకి మా ప్రేమ విషయం తెలిసింది. ఆ రోజునుంచి మేము మాట్లాడుకోవడం మానేశాం.

నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదన్న విషయం అతడికి తెలుసో.. లేదో. ఇది జరిగి 28 ఏళ్లు గడిచిపోయింది. నాకు పెళ్లయింది.తనకు కూడా పెళ్లి అయింది. నా మనసులో ఇప్పటికీ తన రూపం, తన ప్రేమ శాశ్వతంగా ఉంది.  మొదటి ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేము. ఇంకొక జన్మ అంటూ ఉంటే నీ స్నేహాన్ని, ప్రేమను, జీవితాన్ని పంచుకోవాలని ఉంది.
- శ్రావణి


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement