
ప్రతీకాత్మక చిత్రం
నేను హై స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను. కానీ, ఆ అమ్మాయికి నా ప్రేమ విషయం చెప్పటానికి భయం వేసి చెప్పలేక పోయా. ఒక వేళ చెప్పేసి ఉంటే అమ్మాయి కచ్చితంగా ఓకే చేసి ఉండేది. కానీ, నా బ్యాడ్‌లక్ నేను చెప్పలేకపోయా. పదవ తరగతి అయిపోయిన తర్వాత తను మా ఊరికి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ల అమ్మమ్మ వాళ్లు మా ఊర్లోనే ఉంటారు. అప్పుడు తనతో మామూలుగా మాట్లాడేవాడ్ని. అయినా కూడా నా ప్రేమ విషయం తనకు చెప్పలేకపోయా. ఆ తర్వాత కొన్ని రోజులలో ఇంటర్ అయిపోయింది. అమ్మాయి వాళ్ల మొబైల్ నెంబర్ దొరికింది.
తెలిసీతెలియని వయసులో వాళ్ల పేరెంట్స్ నెంబర్ అని తెలియక మెసేజ్‌లు చేశా. అవి వాళ్లు చూసి నాకు వార్నింగ్ ఇచ్చారు. తర్వాత నేను చేసిన తప్పుకు ఆమె ఫేస్‌బుక్‌కి మెసేజ్ చేసి స్వారీ చెప్పుకున్నా. ఆ సంఘటన వల్ల నా మీద ఉన్న మంచి అభిప్రాయం మొత్తం పాడైపోయింది. ఏం చేస్తాం, అది నా బ్యాడ్ లక్! తెలిసీ తెలియని వయసులో అలా చేశా. బట్ ఇప్పుడు నా లైఫ్‌లోకి అంతకంటే మంచి అమ్మాయి వచ్చింది. ఫైనల్‌గా హ్యాపీగా ఉన్నా. జాబ్ రాగానే పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉన్నా.
- శ్రీకాంత్, విశాఖపట్నం
చదవండి : ఆమె లేని లోటును పూడ్చలేకున్నా
చచ్చేదాకా అతడితోనే లైఫ్ అన్నాను
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment