
ప్రతీకాత్మక చిత్రం
నా జీవితంలోకి ప్రేమ ఒక అందమైన కలలా వచ్చి వెళ్ళింది. ఆ కలలోని ఆ అందమైన అమ్మాయి పేరు ఉమాదేవి. చాలా అందంగా ఉంటుంది! అంతకంటే అందంగా నవ్వుతుంది. బహుశా ఆ నవ్వే నన్ను ఆమెని ప్రేమించేలా చేశాయేమో. నేను మొదటిసారిగా ఆమెను నా టెన్త్ ఎక్షామ్ హాలులో చూశా. నా ముందే కూర్చుంది. ఆమెను చూడగానే ఎదో తెలియని ఫీలింగ్! అప్పటివరకు తెలియంది. ఎలాగైనా మాట్లాడాలనుకున్నా కానీ, భయం వేసింది. బహుశా దేవుడు నాపైన జాలి చూపించాడేమో తనే ఎక్షామ్ సెకండ్ రోజు మాట్లాడింది. తను రెసిడెన్సియల్ స్కూల్‌లో చదివానని, తనది బోనకల్ దగ్గర ఒక విలేజ్ అని చెప్పింది. చాలా హ్యాపీగా అనిపించింది.
అలా ప్రతి రోజూ ఆమెను చూడటం, మాట్లాడటం జరిగేది. ఎప్పుడు డే స్టార్ట్ అవుతుందా.. ఆమెను ఎప్పుడు చూస్తానా అనిపించేది. నా జీవితంలో ఇలాంటి రోజులు వస్తాయని అనుకోలేదు. చాలా చాలా హ్యాపీగా ఉండేది. తనతో మాట్లాడుతుంటే నన్ను నేనే మర్చి పోయేవాడిని. నా ప్రేమని ఎలాగైనా చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయా. బహుశా ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో. అంతలోనే ఎక్షామ్స్ అయిపోయాయి. ఎంతో బాధ తనని విడిచి వెళ్తున్నా అని. తనని కలవడం అదే చివరిది అనుకున్నా. కానీ దేవుడు మళ్లీ నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. 2010లో నేను మా బాబాయ్ వాళ్ల ఇంటికి విజయవాడ వెళ్ళినపుడు తను కలిసింది.
ఆమెది మా బాబాయ్ ఇంటి పక్కనే. నన్ను చూడగానే దగ్గరకు వచ్చి మాట్లాడింది. నాకు షాక్ కొట్టినంత పనైంది. నిజంగా ఉమాదేవేనా అనుకున్నా. నన్ను నేను నమ్మలేకపోయా. కాసేపు మాట్లాడిన తర్వాత వేరే పని ఉండటం వలన అక్కడి నుంచి వచ్చేశా. ఆ తర్వాత ఆమెను చూడలేకపోయా. తనని కలవాలని, మాట్లాడాలని ఎంతగానో ఉంది. మళ్లీ ఎప్పుడు ఆ అవకాశం వస్తుందో అని ఎదురు చూస్తున్నా. ఎక్షామ్ చివరి రోజున తను నాకు ఒక కీ చైన్ ఇచ్చింది. ఇప్పటికీ తన గుర్తుగా అది నా దగ్గర ఉంచుకున్నా. నేను చేసిన తప్పు ఎవరు చేయకండి! మంచో చెడో ప్రేమిస్తే చెప్పండి.
- మహేశ్, ఖమ్మం
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment