
ప్రతీకాత్మక చిత్రం
నేనో మిడిల్ క్లాస్ అబ్బాయిని. చిన్నప్పటినుంచి అమ్మానాన్న లేకపోవటం వల్ల చుట్టాల ఇంట్లో ఉండాల్సి వచ్చింది. వారి అరకొర ప్రేమతో విసిగిపోయాను. అక్క పెళ్లి చేయాలని బ్యాంక్ ఉద్యోగం సెలెక్ట్ చేసుకున్నా. ఆ జర్నీలో స్నేహ నాకు పరిచయం అయ్యింది. ఒక సంవత్సరం తనకు బాగా దగ్గరైన తర్వాత ‘పెళ్లి చేసుకుందామా’ అని అడిగా. ప్రపోజ్ ఇలా చేయోచ్చో లేదో నాకు తెలియదు కానీ, తనను చూస్తే అదే అనిపించింది. అమ్మలేని లోటు తన వల్ల తీరుతుందని అనిపించింది. బాధ్యతలు పక్కకు పెట్టకుండా అప్పులు చేసి అక్క పెళ్లి చేశా. ఈ జర్నీలో తను, నా ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు. అక్క పెళ్లి తర్వాత ఆర్థిక ఇబ్బందులు బాగా పెరిగాయి. వాళ్ల ఇంట్లో కూడా టెన్షన్ పెరిగింది. ఆ టెన్షన్ తగ్గించటానికి వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడాను. అంతా ఒకే అయ్యాక వాళ్లింట్లో ఒప్పుకున్నారు. కానీ, కులాలు వేరు. నా ఫ్యామిలీ గురించి అడిగారు! చెప్పలేకపోయాను. బంధులను చాలా మందిని కలిశాను. ‘పెళ్లి చేసుకుంటున్నాను సపోర్ట్‌గా ఉండండి’ అని. ఎవరూ సపోర్ట్ రాలేదు. అప్పుడర్థమైంది.. ప్రేమకు ఇద్దరు వ్యక్తులు అవసరం కానీ, పెళ్లికి మాత్రం రెండు కుటుంబాలు కావాలి అని.
అలా రెండేళ్లు గడిచాయి. ఆర్థిక ఇబ్బందులు బాగా పెరిగాయి. హ్యాండిల్ చేయలేకపోయా. సింగిల్‌గా వెళ్లిపోయి పెళ్లి చేసుకునే ఆలోచన మంచిది కాదు అనిపించింది. కానీ, నాకు ఎలాగూ పేరెంట్స్ లేరు. నాతో వస్తే తను కూడా అనాథలాగా బ్రతకాలి. అయినా రెండు ఫ్యామిలీస్‌ను ఒప్పించి పెళ్లి చేసుకోవటం చాలా కష్టంగా మారింది. రెండు ఫ్యామిలీస్‌ని బాధపెట్టలేను. అక్క, వాళ్ల పిల్లల బాధ్యత నా మీద ఉంది. దీంతో తనతో పెళ్లికి ఆగిపోయాను. తను ఇప్పుడు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. నేను ఇంకా ముందుకు సాగాలి. ఈ మధ్యలో నా ఫ్రెండ్స్ నా కుటుంబంలా తోడుగా ఉన్నారు.
- సత్యసాయి
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి