బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కందకుర్తి వద్దకు చేరుకున్న నీరు
బాసర : మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్ర జల సంఘం, మహారాష్ట్ర, తెలంగాణ నీటి పారుదల అధికారుల సమక్షంలో 14 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం బాబ్లీ వద్ద గోదావరిలో నిల్వ ఉన్న 0.56 టీఎంసీల నీరు దిగువ గోదావరికి ప్రవహిస్తోంది. ఈ నీరు మధ్యాహ్నానికి తెలంగాణ సరిహద్దు కాండకుర్తి వద్దకు చేరుకుంటుంది.
సాయంత్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరుతుంది. దీంతో ప్రాజెక్టులో నీరు నిల్వ రెండు టీఎంసీలకు పెరగనుంది. నేటి నుంచి 120 రోజులు పాటు (అంటే అక్టోబర్ 28 వరకూ) గేట్లు తెరచుకునే ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment