నా కేరీర్‌లో ముఖ్యమైన చిత్రం పండిగై | Actor Krishna happyley floating | Sakshi
Sakshi News home page

నా కేరీర్‌లో ముఖ్యమైన చిత్రం పండిగై

Published Wed, Jul 19 2017 2:24 AM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

నా కేరీర్‌లో ముఖ్యమైన చిత్రం పండిగై

నా కేరీర్‌లో ముఖ్యమైన చిత్రం పండిగై

తమిళసినిమా: యువ నటుడు కృష్ణ విజయానందంలో తేలిపోతున్నారు. చిన్న గ్యాప్‌ తరువాత పండిగై చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. నటి విజయలక్ష్మి నిర్మాతగా మారి తన భర్త ఫిరోజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం పండిగై. కృష్ణకు జంటగా ఆనంది నటించిన ఈ చిత్రానికి ఆర్‌హెచ్‌.విక్రమ్‌ సంగీతాన్ని అందించారు.

గత శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో ఆ సంతోషాన్ని చిత్ర కథానాయకుడు కృష్ణ సోమవారం పాత్రికేయులతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ చిత్ర దర్శకుడు ఫిరోజ్‌ తనకు చిరకాల మిత్రుడన్నారు. ఆయన కొన్ని యదార్థ సంఘటనలతో తయారు చేసిన కథతో తెరకెక్కించిన చిత్రం పండిగై అని తెలిపారు. ప్రేమ, సెంటిమెంట్‌తో పాటు మంచి యాక్షన్‌ సన్నివేశాలతో తనకు యాక్షన్‌ హీరో అంతస్తును అందించిన చిత్రం పండిగై అని చెప్పారు. ఇది తన సినీ కెరీర్‌లోనే చాలా ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు.

కళుగు, యామిరుక్క భయమేన్‌ చిత్రాలు చేసే సమయంలో ఎలాంటి ఫీలింగ్‌ కలిగిందో ఈ పండిగై చిత్రం నటిస్తున్నప్పుడు అలాంటి భావనే కలిగిందన్నారు. ఈ చిత్రంలో తనతో నటించిన ఆనంది చాలా రాశి గల నటి అని, ఈ చిత్రంతో ఆమె ఖాతాలో మరో విజయం చేరిందని అన్నారు. అదే విధంగా నటుడు సవరణన్‌ పండిగై చిత్రం తరువాత మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వెలిగిపోతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే నటుడు నితిన్‌ సత్యకు మంచి పేరు వచ్చిందని చెప్పారు. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారిన నటి విజయలక్ష్మి తనకు మంచి స్నేహితురాలని, ఆమె ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించారని తెలిపారు. టోటల్‌ చిత్ర యూనిట్‌ శ్రమకు దక్కిన విజయం పండిగై అని కృష్ణ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement