
రాక్‌లైన్’ వెంకటేశ్,
ప్రముఖ నిర్మాత, నటుడు ‘రాక్‌లైన్’ వెంకటేశ్ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ఆయన కుమారుడు అభిలాష్ డాక్టర్ కావడంతో అతని హాస్పటల్‌లోనే చికిత్స జరుగుతోందని సమాచారం. సుమలత, అంబరీష్‌ల ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు వెంకటేశ్. గతవారం అంబరీష్ మెమోరియల్‌ను నిర్మించటం కోసం సుమలతతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పని కలిశారు వెంకటేశ్. ఆ తర్వాత సుమలత తనకు కరోనా పాజిటివ్ అని ఎనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో రాక్‌లైన్ వెంకటేశ్‌కి కూడా కరోనా సోకి ఉంటుందనే వార్త వినిపిస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించినవాటిలో రజనీకాంత్ ‘లింగా’, సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్రాలు ఉన్నాయి.