తల్లి అయిన హీరోయిన్.. | Actors Sneha, Prasanna blessed with baby boy | Sakshi
Sakshi News home page

తల్లి అయిన హీరోయిన్..

Published Wed, Aug 12 2015 8:11 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

తల్లి అయిన హీరోయిన్.. - Sakshi

తల్లి అయిన హీరోయిన్..

హీరోయిన్ స్నేహ హోదా ఇప్పుడు పెరిగింది. పెరిగిన హోదా ఏమిటబ్బా అనుకుంటున్నారా? వృత్తి జీవితంలో పైకి ఎదిగిన ఈ అందాల నాయిక వ్యక్తిగత జీవితంలో మెట్టు పెకైక్కింది.

హీరోయిన్ స్నేహ హోదా ఇప్పుడు పెరిగింది. పెరిగిన హోదా ఏమిటబ్బా అనుకుంటున్నారా? వృత్తి జీవితంలో పైకి ఎదిగిన ఈ అందాల నాయిక వ్యక్తిగత జీవితంలో మెట్టు పెకైక్కింది. సోమవారం నాడు ఆమె తల్లి అయింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు చెన్నై వర్గాలు తెలిపాయి. కథానాయిక స్నేహ, తమిళ హీరో ప్రసన్నను పెళ్ళాడిన సంగతి తెలిసిందే. ‘‘నిన్న మా జీవితంలో సుదీర్ఘమైన రోజు. గడచిన రాత్రి మా జీవితంలో అత్యంత కాంతి నింపిన రాత్రి. జీవితంలో ఇవాళ అత్యంత సంతోషకరమైన ఉషోదయం. ఇవన్నీ ఎందుకంటే... మా ఆవిడ స్నేహ మగపిల్లాణ్ణి కన్నది’’ అంటూ మంగళవారం నాడు హీరో ప్రసన్న ట్వీట్ చేశారు.
 
 హీరో ప్రసన్న, స్నేహలది ప్రేమ వివాహం. 2009లో తమిళ చిత్రం ‘అచ్చముండు... అచ్చముండు’లో కలసి పనిచేసినప్పటి నుంచి వాళ్ళిద్దరికీ స్నేహం. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఈ ప్రేమకబుర్ల గురించి అప్పట్లో వచ్చిన వార్తలను వారిద్దరూ మొదట్లో ఖండించారు. అయితే, 2011 చివరకు వచ్చాక, తమ ప్రేమ విషయాన్ని స్నేహ నిర్ధారించారు. 2012 మే 11న పెద్దల అనుమతితో, స్నేహ, ప్రసన్న దంపతులయ్యారు. మూడేళ్ళ తరువాత ఇప్పుడు అమ్మానాన్న అయ్యారు.
 
 ఈ దంపతులకు ఇదే తొలి సంతానం. తమిళంతో పాటు తెలుగులోనూ పలువురు హీరోల సరసన నటించిన స్నేహ నటించిన తాజా చిత్రం - త్రివిక్రమ్ - అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’. మొన్న సమ్మర్‌కు రిలీజైన ఈ చిత్రంలో ఉపేంద్ర భార్యగా, తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన మహిళగా స్నేహ నటన ఆకట్టుకుంది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న స్నేహ కొద్దికాలం విరామం తరువాత మళ్ళీ కెమేరా ముందుకు వస్తారని ఆశ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement