నటి అంకితకు నిశ్చితార్థం | Actress Ankitha Wedding Engagement | Sakshi
Sakshi News home page

నటి అంకితకు నిశ్చితార్థం

Published Mon, Nov 9 2015 3:44 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

నటి అంకితకు నిశ్చితార్థం - Sakshi

నటి అంకితకు నిశ్చితార్థం

నటి అంకిత ఇంట త్వరలో బాజాభజంత్రీలు మోగనున్నాయి. ప్రేమించిన వాడిని కొంగును ముడి వేసుకోనుంది. అంకిత వివాహ నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. ఇంతకీ ఈ అంకిత ఎవరో గుర్తుందా? రస్నాబేబీగా పాపులర్ అయ్యి ఆ తరువాత బాలతారగా పలు చిత్రాలలో నటించిన నటే అంకిత. అలా ప్రకటనల రంగం నుంచి చిత్ర రంగప్రవేశం చేసి హీరోయిన్‌గా ఎదిగిన అంకిత తమిళం, తెలుగు భాషలలో మంచి పేరు తెచ్చుకుంది.

తమిళంలో లండన్, థకధిమితా, తిరుమురుగా, అంబుగురి తదితర చిత్రాలలో కథానాయకిగా నటించిన అంకిత తెలుగులో  జూనియర్ ఎన్టీఆర్‌తో సింహాద్రి, బాలక్రిష్ణ సరసన విజయేంద్రవర్మ వంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది. లాహిరి లాహిరి లాహిరిలో, అందురూ దొంగలే దొరికితే వంటి చిత్రాలలో నటించిన అంకిత కొంత కాలం క్రితం నటనకు దూరం అయ్యి న్యూయార్క్ వెళ్లి అక్కడ సినిమాకు సంబంధించిన కోర్స్ చేసింది.

ఆ సమయంలో పరిచయం అయిన వ్యాపారవేత్త విశాల్‌తో అంకితకు ప్రేమ చిగురించింది. వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో పెళ్లికి లైన్ క్లియర్ అయ్యింది. అంకిత, విశాల్‌ల వివాహ నిశ్చితార్ధం శనివారం ముంబాయిలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరిగింది. వివాహం త్వరలో జరగనుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement