ఈ కరాటే పిడుగును గుర్తుపట్టారా? | actress samatha ruth birthday today | Sakshi
Sakshi News home page

ఈ కరాటే పిడుగును గుర్తుపట్టారా?

Published Thu, Apr 28 2016 12:56 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఈ కరాటే పిడుగును గుర్తుపట్టారా? - Sakshi

ఈ కరాటే పిడుగును గుర్తుపట్టారా?

హైదరాబాద్ : 'ఏమాయ చేసావె' చిత్రంతో తెలుగు కుర్రకారు  గుండెలను మాయ చేసిన సమంత రూత్ ప్రభు సినీ రంగంలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే  స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుంది.  2010లో తెరంగ్రేటం చేసిన ఈ అమ్మడు  వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.  దాదాపు అగ్రహీరోల అందరితోనూ జత కట్టిన ఈ  చెన్నై బ్యూటీ  అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ప్లేస్ దక్కించుంది.  అక్కినేని  ఫ్యామిలీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మనం లో తళుక్కమని ఆకట్టుకున్న సమంత పుట్టినరోజు నేడు. సమంత 1987, ఏప్రిల్ 28న జన్మించిన సమంత ఇపుడు  29 వ వసతంలోకి అడుగు పెడుతోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్నిముఖ్యమైన ఫోటోలు అభిమానుల కోసం..

మరోవైపు తెలుగులో నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అ..ఆ' చిత్రం, ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జనతాగ్యారేజ్' చిత్రంలో చేస్తోంది. దీంతో పాటు ఆమె సూర్యతో చేసిన '24' మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అటు సమంత పుట్టినరోజును  పురస్కరించుకొని సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షల వెల్లువ కురిసింది. దీంతో  ట్విట్టర్ ద్వారా అందరికి హృదయపూర్వక  ధన్యవాదాలు  తెలిపింది ఈ స్టార్ హీరోయిన్. సో.. లెట్స్ విష్ హెర్  ఎ  వెరీ హ్యాపీ బర్త్డే  అండ్ గ్రేట్ ఫ్యూచర్..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement