ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ.. ఘాటుగా ట్వీట్ చేసిన సినీ దర్శకుడు కొరటాల శివ, తాజాగా హోదాకు సంబంధించి మరో ట్వీట్ చేశారు. గత రాత్రి మోదీకి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు గుర్తుచేయాలని, అసలు కేంద్రం తెలుగు రాష్ట్రాలను భారతదేశంలో భాగంగా భావిస్తుందా.. లేదా..? అని ప్రశ్నించారు కొరటాల.
తాజాగా ‘ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో అందరం ఒక్కటిగా స్పందిస్తాం. ఇప్పుడు రాష్ట్రానికి అలాంటి విపత్తే సంభవించింది. రాజకీయాలను, రాజకీయ పార్టీలను పక్కన పెట్టి.. ఓ బాధ్యత గల పౌరుడిగా నేను నా ఆవేదనను ఎలాంటి సంశయం లేకుండా వ్యక్తపరుస్తున్నాను. ఎప్పటికీ ఇలాగే చేస్తాను. ఇందులో రాజకీయ ఉద్దేశం లేదం’టూ ట్వీట్ చేశారు కొరటాల శివ.
Wen natural disasters occur,we all bcome 1 nd react.I felt a similar disaster occurred 2 d state.Keeping politics nd political parties strictly aside,I as a responsible citizen expressed my agony without any hesitation nd calculation.And I’ll keep on doing it. No politics plsssss
— koratala siva (@sivakoratala) 8 March 2018