సాక్షి, హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. విడుదలకు మందే ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు సృస్టించిన అజ్ఞాతవాసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలో ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రం విడుదల కానన్ని స్క్రీన్‌లలో విడుదల కాబోతోంది. ఏకంగా 209 ప్రాంతాల్లో విడుదల కానుంది.
మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్, హీరోయిన్లుగా నట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే హీరోయిన్లు కీర్తిసురేశ్, అను ఇమ్మాన్యుయేల్‌లు తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
అమెరికాలో అజ్ఞాతవాసి రికార్డు
Published Mon, Dec 4 2017 8:56 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment