హ్యాపీగా జాలీగా... | Akhil and Nidhi Agarwal doing mister majnu movie | Sakshi
Sakshi News home page

హ్యాపీగా జాలీగా...

Published Sun, Oct 21 2018 12:46 AM | Last Updated on Sun, Oct 21 2018 12:46 AM

Akhil and Nidhi Agarwal doing mister majnu movie - Sakshi

ప్రేయసితో కలిసి ప్రేమ షికార్లు చేస్తున్నారట అఖిల్‌. ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’. ఇందులో ని«ధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

అఖిల్, నిధిలపై షాపింగ్‌ మాల్స్, పార్కుల్లో ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట టీమ్‌. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటివరకు 60 శాతం పూర్తయిందని సమాచారం. ఇందులో అఖిల్‌ ప్లే బాయ్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారని టీజర్‌ చూస్తే అర్థం అవుతుంది. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్‌ ఆది, విద్యుల్లేఖా రామన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తాజా సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement