ముంబై : హీరోయిన్లే కాదు హీరోలను కూడా వదలడం లేదు సైబర్ నేరగాళ్లు. ఇటీవలే తమ ఫోన్లు హ్యాకింగ్ గురయ్యాయంటూ హీరోయిన్లు అక్షరా హసన్, హన్సిక ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రైవేటు ఫొటోలు లీక్ అవడంతో.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వివరణ ఇచ్చుకున్నారు ఈ ముద్దుగుమ్మలు. తాజాగా.. బాలీవుడు నటుడు అలీ ఫజల్ కూడా వీరి కోవలో చేరిపోయాడు. తనకు సంబంధించిన నగ్న ఫొటోలు ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడంతో అలీ షాక్‌కు గురయ్యాడు.
ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘ అవును ఆ ఫొటోలో ఉంది నేనే.. అయితే ఆ ఫొటోలు ఎలా బయటికి వచ్చాయో నాకు తెలీదు. సమయం వచ్చినపుడు నేను అన్నీ వివరిస్తాను’ అంటూ అలీ ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. ఇది నిజంగా చీప్ టెక్నిక్, వాళ్లది వరస్ట్ టేస్ట్ అని మండిపడ్డాడు. కాగా అలీ ఫజల్ నటించిన ‘మిలాన్ టాకీస్’సినిమా మార్చి 15న విడుదల కానుంది. అలీ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment