బన్నీకి పోటీ తప్పటం లేదు!
సరైనోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అల్లు అర్జున్కి రిలీజ్ విషయంలో మాత్రం టెన్షన్ తప్పేలా లేదు.
సరైనోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అల్లు అర్జున్కి రిలీజ్ విషయంలో మాత్రం టెన్షన్ తప్పేలా లేదు. ముందుగా ఈ సినిమా ఉగాది సందర్భంగా రిలీజ్ చేయాలని భావించినా, పవన్ కళ్యాణ్, సర్దార్ గబ్బర్సింగ్ ను అదే రోజు రిలీజ్ చేయాలని ఫిక్స్ అవ్వటంతో వెనక్కి తగ్గక తప్పలేదు. సర్దార్కి స్పేస్ ఇవ్వటం కోసం తన సినిమాను ఏకంగా రెండు వారాల పాటు వాయిదా వేశాడు బన్నీ. ఏప్రిల్ 22న గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
అయితే తాజాగా మరో స్టార్ హీరోతో బన్నీకి పోటి తప్పేలా లేదు. సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్య హీరోగా 24 సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించినా అప్పటికి, సర్దార్ హవా ఇంకా కొనసాగుతుందనే ఆలోచనతో ఈ సినిమాను ఏప్రిల్ 22న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
సర్దార్ గబ్బర్సింగ్ సినిమాకు హిట్ టాక్ వస్తే రెండు వారాల తరువాత కూడా చాలా థియేటర్లలో కొనసాగే అవకాశం ఉంది. ఆ సమయంలో అల్లు అర్జున్, సూర్యల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్ల సమస్య వస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు కలెక్షన్ల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు విశ్లేషకులు.