27న అమితాబ్కు అక్కినేని అవార్డు ప్రదానం | Amitabh Bachchan to be felicitated with ANR award on december 27th | Sakshi
Sakshi News home page

27న అమితాబ్కు అక్కినేని అవార్డు ప్రదానం

Published Sat, Dec 20 2014 1:11 PM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

27న అమితాబ్కు అక్కినేని అవార్డు ప్రదానం

27న అమితాబ్కు అక్కినేని అవార్డు ప్రదానం

హైదరాబాద్ :  ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈనెల 27న అందుకోనున్నారు. ఈ విషయాన్ని అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ శనివారం వెల్లడించింది. 2013 సంవత్సరానికి గానూ అమితాబ్కు అక్కినేని ఫౌండేషన్ ప్రదానం చేయనుంది.

2005 వ సంవత్సరం నుండి భారతీయ సినిమా రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి అక్కినేని అవార్డును ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పురస్కారం కింది రూ.5 లక్షల నగదుతో పాటు ప్రశంసాపత్రంతో సత్కరించనున్నారు. గతంలో ఈ అవార్డును దేవానంద్, షబానా అజ్మి, అంజలి దేవి, లతా మంగేష్కర్, వైజయంతి మాలా, బాలచందర్, హేమమాలిని, శ్యాం బెనగల్ తదితరులు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement