సినిమా: 30సార్లు తిరస్కరింపబడ్డానని నటి అమైరా దస్తూర్ చెప్పింది. అనేగన్ చిత్రంలో ధనుష్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బాలీవుడ్ భామను ఆ తరువాత ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్య ఒక దక్షిణాది నటుడు తనను పడక గదికి రమ్మన్నాడని, అందు కు నిరాకరించినందుకు గానూ, షూటింగ్‌లో లైట్ల ముం దు గంటల కొద్ది నిలబెట్టడం లాంటి వేధింపులకు గురి చేశారని ఆరోపణలు గుప్పించి వార్తల్లోకెక్కిన ఈ బ్యూటీ తాజాగా మరోసారి సినీ పరిశ్రమపై ధ్వజమెత్తింది. ఇక్కడ సినీ నేపథ్యం లేకపోతే అవకాశాలు రావడం కష్టం అని చెప్పింది. నటీనటుల వారసులైతే అవకాశాలు సులభంగా వరిస్తాయని అంది. వారికైతే నటనలో శిక్షణ ఉందా? అని కూడా పరి క్షించరని చెప్పింది.
తాను సినీ అవకాశాల కోసం చెప్పులరిగేలా చిత్ర కార్యాలయాలకు తిరిగినప్పుడు పలువురు తనను నిరాకరించారని చెప్పింది. అలా 30 చిత్రాల ఆడిషన్స్‌లో పాల్గొని నిరాశకు గురయ్యానని అంది. ఆ తరువాత 2013 లో ఇషాక్ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నానని చెప్పింది. ఇక తొలి చిత్రం విజయవంతం అయితేనే తదుపరి అవకాశాలు వస్తాయని, సరిగా ఆడకపోతే ఇక అంతే సంగతులని అంది. అదే సినిమా నేపథ్యం ఉన్న వారినైతే అందరూ ఆదరిస్తారని, బయట వారిని పట్టించుకోరని నటి అమిరా దస్తూర్ ఆవేదన వ్యక్తం చేసింది. హిందీతో పాటు, తెలుగు, తమిళం భాషలపైనా గురి పెట్టిన ఈ అమ్మడు దాదాపు మూడేళ్ల తరువాత తమిళంలో ఓడి ఓడి ఉళైక్కనుమ్ అనే చిత్రంలో నాయకిగా నటిస్తోంది. ఇది అమైరా దస్తూర్‌కు తమిళంలో రెండో చిత్రం అన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment