
అశ్వినీ అయ్యర్, కంగనా రనౌత్
కబడ్డీ కోర్టులో ప్రత్యర్థులను చెడుగుడు ఆడేందకు సిద్ధమయ్యారు కథానాయిక కంగనా రనౌత్. ‘బరేలీ కీ బర్ఫీ’ ఫేమ్ అశ్వినీ అయ్యర్ తివారి దర్శకత్వంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘పంగా’ చిత్రం ఆదివారం మొదలైంది. ఇందులో కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తారు కంగనా. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ భోపాల్‌లో స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ 20 రోజులు సాగనుందని బాలీవుడ్ టాక్.